ఒంగోలు::
స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనవడు టంగుటూరి గోపాలకృష్ణ సోమవారం ఉదయం 5.10 గంటలకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో వారి కుమారుని ఇంట స్వర్గస్తులైనారు.
స్వాతంత్ర్య సమరయోధులు, పూర్వ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంట జన్మించినా… గర్వమనేది లేక 1993 సం.లో కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరి, 2016 డిసెంబరు 31న స్వచ్చంధ ఉద్యోగవిరమణ చేశారు. వీరికి భార్య టంగుటూరి విజయలలిత, ఇద్దరు కుమారులు టంగుటూరి సాయిక్రాంత్, టంగుటూరి ప్రకాష్ లు. గొపాలకృష్ణ స్వాతంత్ర్య దినొత్సవ వెడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు, ప్రకాశం పంతులు జయంతి, వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొంటూ తమ తాతగారి పోరాట పటిమను గుర్తుచేస్తుండేవారు.
సోషల్ మీడియాలో ఏక్టివ్ గా ఉండే గోపాలకృష్ణ మృతికి పలువురు సంతాపం తెలియచేశారు. తమ మరణానికి ముందు ముఖపుస్తకంలో “మరణం తరువాత మైల ఎన్నిరోజులు ఉంటుందనే” పోస్ట్ చేయడం వారికి తమ పయనం ముందే తెలిసిందా అన్న భావనను కొందరు మిత్రులు వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని పాత్రికేయులు నెమ్మాని సీతారామమూర్తి, యంవిఎస్ శాస్త్రి, రాధా రమణ గుప్తా జంధ్యం, పొన్నూరు వేంకట శ్రీనివాసులు, మైనంపాటి సాయి, యువి రత్నం, తోటి ఉద్యోగస్తులు తదితరులు గోపాలకృష్ణ మృతి సంతాప ప్రకటనలో తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025