April 18, 2025
SGSTV NEWS
CrimeTelangana

పెళ్లి చూపులకు వెళ్లి.. కటకటాలపాలై..

హైదరాబాద్‌: ఎస్‌ఐ ఉద్యోగం రాకపోవడంతో నకిలీ ఎస్‌ఐగా అవతారం ఎత్తిన యువతిని నార్కెట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐనని చెప్పుకుని శంకర్‌పల్లిలో విధులకు సైతం మాళవిక హాజరైంది. ఎస్‌ఐ డ్రెస్‌లో పెళ్లి సంబంధానికి కూడా వెళ్లింది. అప్పుడే అసలు గుట్టు రట్టయ్యింది.

జరిగింది ఇదీ..
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలీసు కావాలనేది ఆమె కోరిక. అందుకోసం 2018లో జరిగిన ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ ఎగ్జామ్‌ రాసింది. కంటి చూపు సరిగా లేకపోవడం ఉద్యోగానికి ఎంపిక కాలేదు. దీంతో ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ అవతారమెత్తిన మాళవిక విధులకు వెళ్తున్నట్టు ఏడాది పాటు కుటుంబ సభ్యులను నమ్మించింది. పెళ్లి చూపులకు కూడా అదే యూనిఫాంలో వెళ్లి చివరికి జైలుపాలైంది.

అబ్బాయి తరఫు బంధువులు ఆర్పీఎఫ్‌లో అధికారులను ఆరా తీయగా ఆమె అసలు గుట్టు బట్టబయలైంది. ఎల్‌బీ నగర్‌లోని ఆర్పీఎఫ్ పోలీసులు ధరించే యూనిఫాం కొనుగోలు చేసింది. రైల్వే ఎస్సైగా నల్గొండ లో విధులు నిర్వహిస్తున్నట్లు దాదాపు ఏడాది పాటు ప్రజలను నమ్మించి మోసాలకు తెరతీసింది. దేవాలయాలకు వెళ్లి, ప్రముఖులను కలిసి ఫోటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేసేది. వెంటనే అప్రమత్తమైన నల్గొండ ఆర్పీఎఫ్‌ సిబ్బంది మాళవికను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Also read

Related posts

Share via