November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ఘోరంగా మోసపోయిన కర్ణాటక యువతి నందితా శెట్టి! సినిమా ఛాన్స్ ల పేరుతో!

సినిమా ఆఫర్స్ అంటూ ఈమధ్య కాలంలో చాలానే ఫేక్ ముఠాలను చూస్తూ వస్తున్నాం. వారి గురించి చాలానే వార్తలు వస్తున్నాయి. అలా ఒక యువతి సినిమా ఛాన్స్ పేరిట ఘోరంగా మోసపోయింది.

సినిమాలాంటి రంగుల ప్రపంచంలో అడుగు పెట్టాలి అని ఎంతో మందికి ఉంటుంది. వారి టాలెంట్ నిరూపించుకుని ఒక బిజీ ఆర్టిస్టుగా మారిపోవాలి అనుకుంటారు. అందుకు కావాల్సిన విధంగా తమని తాము తయారు చేసుకుంటారు. కొందరు అమ్మాయిలు అయితే మోడలింగ్ చేస్తూ.. సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు అమ్మాయిలు అయితే రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ గా మారిపోయి సినిమాల్లోకి అడుగుపెట్టాలి అనుకుంటారు. అయితే ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని కొందరు మోసాలు చేస్తూ ఉంటారని మీకు తెలుసా? ఇలా మోడలింగ్, రీల్స్ చేస్తూ సినిమా ఆఫర్స్ కోసం చూసే వారికి ఇది వేకప్ కాల్ అనే చెప్పాలి. ఇలాంటి మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి.


ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. నందితా కే శెట్టి అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. తనకు తమిళ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి తనను మోసం చేశాడు అని చెప్పుకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందితా కే శెట్టి మోడల్ గా చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అలా ఒకసారి ఆమెకు ఒక మూవీ కాస్టింగ్ కాల్ యాడ్ కనిపించింది. ఇంకేముంది.. ఆ నంబరుకు కాల్ చేసింది. తనకు ఇంట్రెస్ట్ ఉందని.. తాను నటిగా మారాలి అనుకుంటున్న విషయాన్ని చెప్పింది. సురేష్ కుమార్ అనే వ్యక్తిని అప్రోచ్ అవ్వగా.. అతను తమిళ్ మూవీ హంటర్ లో అవకాశం కల్పిస్తానని మాయ మాటలు చెప్పాడంట.

ఆ యువతి నుంచి ఏదో ఒక కారణం చెప్పి డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడంట. మొదట తనకు సినిమా అవకాశం ఇవ్వాలి అంటే ఆర్టిస్టు కార్డు తీసుకోవాలి అని చెప్పాడు. అందుకు రూ.12,500 తీసుకున్నాడంట. ఆ తర్వాత మూవీ అగ్రిమెంట్ కోసం స్టాంప్ డ్యూటీ కింద రూ.35 వేలు తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా.. షూటింగ్ కి సంబంధించి మలేషియా వెళ్లాలి.. నందితాకి తన తండ్రికి ఫ్లైట్ టికెట్స్ కోసం మరో రూ.90 వేలు కాజేశాడు అంట. ఇలా మొత్తం నందితా కే శెట్టి నుంచి ఏకంగా రూ.1.70 లక్షలు సురేశ్ కాజేశాడు అని ఆమె ఫిర్యాదులే పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ చీటింగ్ కేసుకు సంబంధించి కోనానకుంటే పోలీస్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రీల్స్, మోడలింగ్ చేస్తూ ఎలాగైనా ఆర్టిస్టుగా మారాలి అని కలలు కనేవారికి ఇది వేకప్ కాల్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ లో మీ కలను అవకాశంగా మార్చుకుని మోసం చేసేవాళ్లు చాలామందే ఉన్నారు. అందుకు ఈ ఘటన కూడా ఒక ఉదాహరణ. సినిమా అవకాశం ఇచ్చేవాళ్లు మీరు రెమ్యూనరేషన్ ఇస్తారు. మీ దగ్గర తీసుకోరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే చాలా వరకు మోసాలు ఆగిపోతాయి.

Also read

Related posts

Share via