November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఏలూరులో ఘరానా మోసం.. అధిక వడ్డీ ఆశతో లక్షలు పోగొట్టుకున్న ప్రజలు


ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆన్‌లైన్‌ యాప్‌లో పెట్టుబడిపెట్టి సుమారు 200 మంది మోసపోయారు. ఏఎస్‌వో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ పేరుతో తమ ఆన్‌లైన్‌ యాప్‌లో రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.750 వడ్డీ వస్తోందని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు.

డబ్బులకు ఆశపడి ఆన్ లైన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఎంతో మంది మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని బలవుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో ఇలాంటి ఓ సంఘటనే చోటుచేసుకుంది. ఏఎస్‌వో ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపించి కొందరు కేటుగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆన్‌లైన్‌ యాప్‌లో పెట్టుబడిపెట్టి సుమారు 200 మంది  మోసపోయారు. ఏఎస్‌వో ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సంస్థ తమ ఆన్‌లైన్‌ యాప్‌లో రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.750 వడ్డీ వస్తోందని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు.

వడ్డీ వస్తుందనే ఆశతో..
వడ్డీ ఎక్కువ వస్తుందనే ఆశపడి దాదాపు 200 మంది ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే 2 వారాల నుంచి యాప్ పని చేయట్లేదు. దీంతో ఏం చేయాలో తెలీక బాధితులు విలవిల లాడుతున్నారు. ఆన్‌లైన్‌ యాప్‌లో పెట్టుబడిపెట్టి లక్షలు పోగొట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. సదరు బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.

Also read

Related posts

Share via