December 17, 2024
SGSTV NEWS
CrimeNational

హాయిగా ఉండు..పెళ్ళి చేసుకో..లవర్‌‌కు మెసేజ్‌ పెట్టి యువతి ఆత్మహత్య


గుజరాత్‌లో ఓ యువతి మరణం కలకలం రేపింది. నేను చనిపోతున్నా…నువ్వు పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అంటూ లవర్‌‌కు ఒక మెసేజ్ వదిలేసి మరీ వెళ్ళిపోయింది. అయితే ఇది పెళ్ళి చేసుకున్న భర్త గురించి కాక మరో వ్యక్తికి అవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్ పూర్‌‌లో రాధ ఠాకూర్ అనే 27ఏళ్ళయువతి ఆత్మహత్య చేసుకుంది.  ఈమె అక్కడే ఒక బ్యూటీ పార్లర్ నడుపుతోంది. రాధకు పెళ్ళయింది కానీ భర్తతో విడిపోయి సోదరితో కలిసి జీవిస్తోంది. ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన రాధ..సోదరితో కలిసి భోజనం చేసి నిద్రపోయింది. మర్నాడు ఉదయం ఎంత లేపినా లేవలేదు. చివరకు ఆమె చనిపోయింది తెలిసింది. దీంతో రాధ ఫోన్ చెక్ చేశారు. అందులో ఆడియో మెసేజ్‌లను గుర్తించారు. ఆమె.. వేరే వ్యక్తితో ఫోన్‌లో సంభాషించినట్లు గా గుర్తించారు. వెంటనే రాధ సోదరి అల్కా పోలీసులను ఆశ్రయించింది. గుర్తుతెలియని వ్యక్తిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

చనిపోయే ముందు ఆడియో మెసేజ్..
రాధ ఫోన్లో మరిన్ని విషయాలను పోలీసులు గమనించారు. ఆమె.. ఆ వ్యక్తిని ఫొటో అడగడం కూడా వినిపించింది. అయితే అతడు ఆ ఫొటో పంపించలేదు. అయితే గంటలోగా ఫొటో రాకపోతే ఏమవుతుందో చూడు అంటూ రాధ హెచ్చరించినట్లుగా ఆడియోలో వినిపించింది. దీని తరువాత వెంటనే అతనికి మళ్ళీ సారీ చెప్పింది. నన్ను క్షమించు.. మిమ్మల్ని అడగకుండానే తప్పు చేస్తున్నాను. బాధపడకండి.. సంతోషంగా ఉండండి. జీవితాన్ని ఆస్వాదించండి. వివాహం చేసుకోండి. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయానని  అనుకోవద్దు. చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నా. మీరు సంతోషంగా ఉంటే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. పని మరియు జీవితంపై కలత చెందాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని రాధ మాట్లాడింది. ప్రస్తుతం రాధ మరణ ఒక మిస్టరీగా మారింది. ఆమె ఎవరికి మెసేజ్‌లు పంపింది…ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read

Related posts

Share via