Garuda Purana: గరుడపురాణం ప్రకారం
పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. లేదా మీ పితృదేవతలు సంతోషంగా ఉన్నారు అని తెలియడానికి కొన్ని సంకేతాలు వస్తాయట. ఆ సంకేతాలను బట్టే మీ పితృదేవతులు చాలా హ్యాపీగా ఉన్నారని అర్థం చేసుకోవాలట. అయితే పితృదేవతలు సంతోషంగా ఉన్నారు అనానికి ఈ కొన్ని సంకేతాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ గ్రంథాల ప్రకారం పితృదేవతలు (పూర్వీకులు) మనల్ని ఆశీర్వదించడానికి లేదా గుర్తు చేయడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయని పురాణాలలో చెప్పబడింది. ఇవి సాధారణంగా పితృపక్షం, అమావాస్య, శ్రాద్ధ కాలంలో ఎక్కువగా అనుభవిస్తారని నమ్మకం. పితృదేవతల (పూర్వీకుల) ఆశీస్సులు మనపై ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మన పురాణాలు మరియు జ్యోతిష్య శాస్త్రం కొన్ని సంకేతాలను చెబుతాయి. పితృదోషం లేకపోవడం మరియు వారి ఆశీస్సులు లభించడం వల్ల జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
ఆకస్మిక కార్యసిద్ధి: మీకు చాలా కాలంగా ఆగిపోయిన
పనులు లేదా ఎంత ప్రయత్నించినా పూర్తి కాని పనులు అకస్మాత్తుగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుంటే.. అప్పుడు మీకు పితృదేవతల అశీర్వాదం లభించిందని అర్థం చేసుకోవాలట.
సంతానాభివృద్ధి: మీ కుటుంబంలో సంతానలేమి
సమస్యలు తొలగిపోవడం.. అసలు సంతాన సమస్యలు లేకపోవడం.. లేదా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఎదుగుతుండటం కూడా పితృదేవతల ఆశీస్సులు మీపై ఉన్నాయనడానికి ప్రధాన సంకేతమట. వారి దీవెనలు ఉంటేనే వంశాభివృద్ధి సాద్యమవుతుందట.
కలలో పూర్వీకులు కనిపించడం: మీ కలలో మీ తాతముత్తాతలు లేదా మరణించిన తల్లిదండ్రులు ప్రశాంతంగా, చిరునవ్వుతో కనిపిస్తే.. వారు మీపై సంతోషంగా ఉన్నారని మరియు మిమ్మల్ని మీ పితృదేవతలు ఆశీర్వదిస్తున్నారని అర్థమట.
ఇంట్లోకి పక్షులు, జంతువుల రాక: హిందూ ధర్మశాస్త్రం
ప్రకారం మీ ఇంట్లోకి పక్షులు లేదా జంతువులు వస్తుంటే.. మీ పితృదేవతులు సంతోషంగా మీపై ఆశీస్సులు కురిపిస్తున్నారని అర్థం చేసుకోవాలట. అలాగే పితృదేవతలు కాకుల రూపంలో ఆహారాన్ని స్వీకరిస్తారని అంటారు. మీరు పెట్టిన పిండం లేదా ఆహారాన్ని కాకులు వెంటనే స్వీకరించినా, లేదా మీ ఇంటి ఆవరణలోకి అప్పుడప్పుడు పక్షులు వచ్చి ప్రశాంతంగా వెళ్తున్నా కూడా మీ పితృదేవతలు సంతోషంగా ఉన్నారని అర్థం చేసుకోవాలట.
గృహ శాంతి: ఎటువంటి అనవసర గొడవలు లేకుండా
కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమాభిమానాలు ఉండటం పితృదేవతల కృపకు నిదర్శనం అంటారు. ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవం పెరగడం కూడా ఒక సంకేతమేనట.
పండుగలు, శుభకార్యాలు: మీ ఇంట్లో తరచూ ఏదో
ఒక శుభకార్యం (పెళ్లిళ్లు, నామకరణాలు) జరుగుతుండటం, ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం కలగడం కూడా పితృదేవతల సంతోషానకి కారణాలేనట.
చిన్న సూచన: పితృదేవతల ఆశీస్సులు ఎప్పుడూ మనపై
ఉండాలంటే.. అమావాస్య రోజున వారికి తర్పణాలు వదలడం, అన్నదానం చేయడం లేదా పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టడం లాంటి పనులు చేస్తుండాలట.
