February 24, 2025
SGSTV NEWS
CrimeNational

Crime News: పేరుకి గజదొంగ.. ప్రేమలో ఆణిముత్యం: చోరీ సొమ్ముతో ప్రియురాలికి రూ.3కోట్ల ఇల్లు!


షోలాపూర్‌కు చెందిన పంచాక్షరిస్వామి తన గర్ల్‌ఫ్రెండ్‌కు రూ.3కోట్లతో ఇల్లు కట్టించాడు. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేశాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని ఆమెకు కోల్‌కతాలో రూ.3కోట్లతో ఇల్లు నిర్మించాడు. తాజాగా పోలీసులు అరెస్ట్ చేయగా ఈవిషయం వెల్లడైంది

Crime News: ప్రేమంటే ఇదేరా.. ! అనే విధంగా ఓ వ్యక్తి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడు ఉంటున్న ఇంటికి వేలం నోటీసులు వచ్చినా.. అతడు మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌కు రూ.3 కోట్ల ఇళ్లు, రూ.22 లక్షల అక్వేరియం ఇచ్చాడు. అవును మీరు విన్నది నిజమే. అయితే ఇదంతా అతడు ఏదో జాబ్ చేసి ఇచ్చింది కాదు.. దొంగతనాలు చేసి కూడబెట్టిన డబ్బుతో కొనిచ్చింది.

ఈ విషయం తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఓ చోరీ కేసులో నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు.. అతడ్ని విచారించగా గతం తెలిసి నివ్వెరబోయారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ దయానంద్‌ మంగళవారం ఆ నిందితుడికి సంబంధించిన వివరాలు తెలియజేశారు.

చిన్నప్పటి నుంచే దొంగతనాలు..
37 ఏళ్ల పంచాక్షరి స్వామి మహారాష్ట్రలోని సోలాపుర్‌లో ఉంటున్నాడు. అతడు తన చిన్నప్పటి నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. అలా దొంగతనాలు చేసి చేసి బాగా ప్రొఫెసనల్‌గా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు కొన్ని పదులు, వందల సంఖ్యలో దొంగతనాలు చేశాడు.

ఇంకా ఇంకా చేయాలని తాపత్రయ పడ్డాడు. కోట్లు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇలా 2009 నాటికి ఎవరూ ఊహించని ప్రొఫెషనల్‌గా మారి చోరీలు చేశాడు. అలా 2014 – 2015 సమయంలో ఓ ప్రముఖ సినీ హీరోయిన్‌తో కాస్త సాన్నిహిత్యం ఏర్పడింది. ఆమె కోసం కోట్లు ఖర్చు పెట్టాడు.

రూ.3కోట్లతో ఇల్లు..
అంతటితో ఆగకుండా ఆమెకు భారీగా ఖర్చు పెట్టి ఇల్లు కట్టించాడు. కోల్‌కతాలో దాదాపు రూ.3 కోట్లతో ఇల్లు కట్టించడంతో పాటు అందులో రూ.22 లక్షల విలువైన అక్వేరియాన్ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అనంతరం కటకటాల పాలయ్యాడు. 2016లో ఓ కేసులో గుజరాత్ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. దీంతో 6ఏళ్లు జైల్లో ఉన్న అతడు.. ఆ తర్వాత బయటకొచ్చి 2024లో బెంగళూరుకు మకాం మార్చాడు.

అక్కడ మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈ మడివాలా ప్రాంతాలో దొంగతనం చేయగా.. దర్యాప్తులో భాగంగా అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతడు చేసిన దొంగతనాల్ని ఒప్పుకున్నాడు. అనంతరం అతడి వద్ద నుంచి దాదాపు 181 గ్రాముల బంగారం, 333 గ్రాముల వెండి, పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తన గర్ల్‌ఫ్రెండ్‌కు కోట్లు పెట్టి ఇల్లు కట్టించిన స్వామి మాత్రం తన తల్లితో వేరోక ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇంటికి వాయిదాలు కట్టకపోవడంతో వేలం నోటీసులు వచ్చినట్లు సమాచారం.

Also read

Related posts

Share via