ఈ మధ్య కాలంలో చాలామంది యువకులు సరదా కోసం పార్టీలు చేసుకుంటూ..చిన్న చిన్న కారణాలకే ఘర్షణలకు దిగుతున్నారు. ఇక ఈ వివాదాలు కాస్త పెద్దవి కావడంతో విచాక్షరహితంగా దాడులు చేసుకోవడం, దారుణంగా హత్యలు చేయడం వంటివి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుట్టిన రోజు వేడుకల్లో బీరు కోసం వచ్చిన గొడవ ఓ యువకుడి ప్రాణాన్ని బలికొన్నది. ఇంతకి ఎక్కడంటే..
Also read :పల్నాడు : రాత్రి సాధారణం.. ఉదయానికల్లా ఇంటి గోడలు, చెట్లకు చీలలు..
ఇటీవల కాలంలో చాలామంది యువత సరదా కోసం పార్టీలని, పబ్ లని లేని పోని వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఇక ఈ వ్యసానాల కారణంగా అప్పటి వరకు మంచిగా ఉన్న స్నేహితులు మధ్య చిన్న చిన్న కారణాలే పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే మాటకు మాటా పెరిగి విచాక్షరహితంగా దాడులు చేసుకోవడం, దారుణంగా హత్యలు చేయడం వంటివి చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్న వారంత చిన్న వయసులో ఉన్న యువకుల కావడం గమన్హారం. కేవలం క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని లేనిపోని ఘోరాలకు పాల్పడుతున్నారు. దీంతో వారి జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా.. ఎదుట వారి జీవితాలను కూడా నాశనం చేస్తూ.. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుట్టిన రోజు వేడుకలో బీరు కోసం వచ్చిన గొడవ ఓ యువకుడి ప్రాణాన్ని బలికొన్నది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
Also read :Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. 12 మంది కలెక్టర్ల బదిలీ.. పూర్తి వివరాలు
తాజాగా ఓ యువకుడి పుట్టినరోజు వేడుకలు తీవ్ర విషాదంగా ముగిశాయి. ఎంతో సరదాగా స్నేహితులతో కలిసి చేసుకోవాల్సిన పుట్టిన రోజు వేడుకల్లో చిన్న పాటి వివాదం బర్త్ డే బాయ్ మృతికి దారి తీసింది. ఇక ఈ వివాదంలో బీరు కోసం స్నేహితులే అతడి మృతికి కారణం అయ్యారు. అయితే పార్టీకి పిలిచిన స్నేహితులు బీరు కోసం గొడవపడి అతడిని నాలుగో అంతస్తు నుంచి కిందకి తోసేశారు. అయితే ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లా ఉల్హాస్‌నగర్‌లో చోటు చేసుకుంది. అయితే ఠాణె పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉల్హాస్‌నగర్ కు చెందిన కార్తీక్ అనే 23 ఏళ్ల యువకుడు జూన్ 27న తన పుట్టిన రోజు వేడుకల కోసం ముగ్గురు స్నేహితుల్ని ఇంటికి పిలిచాడు.
అయితే మద్యం విషయంలో వారి మధ్య న్నపాటి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే పార్టీకి వచ్చిన ముగ్గురు స్నేహితులు అతడిని కిందకి తోసేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాకపోతే మొదట ఈ ఘటనలో నిందుతులు తప్పించుకున్నప్పటికి.. మృతుడి తల్లిదండ్రులు చెప్పిన వివాలతో అతడి స్నేహితులందర్నీ ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఈ ఘటనకు కారకులైన నిందితులు ధీరజ్ (23), నీలేశ్ (23), సాగర్ (24) గా గుర్తించారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం బుధవారం వరకు కస్టడీ విధించింది. మరి, బర్త్ డే పార్టీకి పిలిచినందుకు బీరు కోసం స్నేహితుల చేతే హత్య గురైన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి
Also read :Crime News: యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య