తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ (ఆర్ధిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ(ఆర్థిక నేరాల విభాగం) పోలీసులకు చిక్కాడు.సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ కె. ప్రసాద్, ఏసీపీ
సోమనారాయణ సింగ్ శనివారం ఓ ప్రకటనలో
వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏపీలోని తిరుపతికి
చెందిన గంటా శ్రీధర్ (40) మాదాపూర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ.. కొండాపూర్ మసీదు బండలోకుటుంబంతో నివాసం ఉండేవాడు. సహోద్యోగులు, వారి కుటుంబికులతో పాటు.. కొంపల్లిలో ఓ వ్యాపారితోనూ పరిచయం పెంచుకున్నాడు. తనకు తెలిసిన వ్యక్తులు మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారం కొనుగోలుచేస్తారని.. అందరూ పెట్టుబడులకు ముందుకు రావాలని చెప్పేవాడు. డబ్బు చెల్లించిన కొద్ది రోజుల తర్వాత
బంగారం డెలివరీ అవుతుందని చెప్పాడు. అతని
మాటలు నమ్మిన కొంపల్లి వ్యాపారి రూ.1.48 కోట్లు
బదిలీ చేశారు. మరో 12 మంది నుంచి కలిపి నిందితుడు మొత్తం రూ.6.12 కోట్లు వసూలు చేశాడు. వీరందరికీకొన్ని ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులు ఇచ్చాడు.సికింద్రాబాద్ లోని 2 బంగారం దుకాణాల పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. అందరికీ మార్చి 22న బంగారం డెలివరీ చేస్తానని చెప్పాడు. అయితే మార్చి 5న అందరికీ ఫోన్ చేసి తిరుపతిలో తనకు సంబంధించిన భూ సమస్య ఉండటంతో వెళ్తున్నానని చెప్పి.. భార్యాపిల్లలతో సహా ఉడాయించాడు. అప్పటి నుంచి ఫోన్ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా కొండాపూర్లోని అతను ఫ్లాటు ఖాళీ చేశాడని, మోసపోయామని తెలుసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు. చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని తిరుపతిలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చి.. శనివారం రిమాండుకు తరలించారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!