తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ పేరుతో డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. ఇక నమ్మిన ఓ మహిళ వైద్యరాలు లక్షల రూపాయలను పోగొట్టుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే..
ఇటీవ కాలంలో డీప్ ఫేక్ వీడియోలు జరుగుతున్న మోసాలు రోజు రోజుకి ఎక్కవైపోతున్నాయి. అయితే ఒకవైపు కావలనే కొంతమంది ఆకాతాయి వ్యక్తులు సెలబ్రిటీస్ కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలను వైరల్ చేస్తుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు ప్రముఖుల పేర్లతో డీప్ ఫేక్ వీడియోలను చేస్తూ లక్షలు రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే ఈ తరహా సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకొని బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఉన్నత అధికారులు, సామాన్యులు సైతం మోసపోయి భారీ మొత్తంలో నగదును పొగొట్టుకుంటున్నారు. తరుచు ఈ ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల సైబర్ మోసలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సైబర్ కేటుగాళ్లు ఈసారి ఏకంగా అంబానీ పేరుతో భారీగా లక్షల రూపాయాలను కాజేసి మోసం చేశారు. ఇంతకి ఏం జరిగిందంటే..
తాజాగా ముంబైలోని అంధేరిలో మహిళా ఆయుర్వేద వైద్యురాలిని రూ.7 లక్షలు మోసం చేసిన ఉదంతం వెలుగు చూసింది. కాగా, ఆ వైద్యురాలు మోసపోవడానికి డీప్ ఫేక్ వీడియో కారణం. ఇంతకి ఏం జరిగిందంటే.. 54 ఏళ్ల డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా షేర్ ట్రేడింగ్ స్కామ్‌కు గురయ్యారు. కాగా, ఆ రీల్స్ లో ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ డీప్‌ఫేక్ వీడియోను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేశారు. ఇక అందులో అంబానీ ‘రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్’ గురించి మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతేకాకుండా అధిక రాబడి కోసం ఈ కంపెనీకి చెందిన బీసీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అకాడమీలో చేరాలని అంబానీ ప్రజలను కోరుతున్నట్లు కనిపించింది. దాంతో పాటు అంబానీ నుంచి అధిక రాబడులు వస్తుందని నమ్మబలికారు. ఇక ఈ వీడియోను నమ్మిన మహిళ వైద్యరాలు పలుమార్లు నగదును డిపాజిట్ చేసింది.
ఈ క్రమంలోనే ఇప్పటి వరకు రూ.7 లక్షలు జమ చేసింది. అయితే ఆమె ట్రేడింగ్ వెబ్ సైట్ లో రూ.రూ.30 లక్షల లాభం చూపుతోంది, కానీ ఆమె దానిని విత్‌డ్రా చేయలేకపోయింది. దీంతో ఆమెకు సందేహం వచ్చింది. దీనిపై మహిళ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. ఈ కేసులో దుండగులు డీప్‌ఫేక్ టెక్నాలజీ సాయం తీసుకున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీంతో తాను రూ. 7 లక్షలు మోసపోయనని ఆ మహిళ వైద్యురాలు వాపోయింది. ఇక ఈ విషయంపై బ్యాంకు నోడల్ అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ మహిళ నగదు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అంబానీ పేరు మీద ఇలా డీప్ ఫేక్ వీడియో రావడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా మార్చిలో, స్టాక్ ట్రేడింగ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే విధమైన వీడియో బయటపడింది. కాగా, అందులో స్టూడెంట్ వెనెట్ పేజీని ప్రజలు ఫాలో అవ్వాలని ఏఐ ద్వారా అంబానీ చెప్పినట్లు కనిపించింది. ఇక ఇక్కడ ఇంటర్నెట్ వినియోగదారులు ఉచిత పెట్టుబడి సలహా పొందవచ్చని వీడియోను సైబర్ నేరగాళ్లు రిలీజ్ చేశారు.