తాను ప్రేమించిన యువతితో మాట్లాడాడన్న కోపంతో ఓ యువకుడు ఇంటర్ విద్యార్థిపై కక్షగట్టాడు. మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి నిందితులు పైశాచిక ఆనందం పొందారు

మలికిపురం, : తాను ప్రేమించిన యువతితో
మాట్లాడాడన్న కోపంతో ఓ యువకుడు ఇంటర్ విద్యార్థిపై కక్షగట్టాడు. మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి నిందితులు పైశాచిక ఆనందం పొందారు. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తాను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడినందుకు ఏఎఫ్టీ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిపై ఓ యువకుడు పగ పెంచుకున్నాడు. తన స్నేహితులు మరో ముగ్గురితో కలిసి బాధితుణ్ని ఈ నెల 5న స్థానిక సినిమా హాలు వెనుక స్థలంలోకి తీసుకుపోయారు. అందరూ ఒక్కసారిగా ముష్టిఘాతాలతో కుళ్లబొడిచి, చెట్టుకు కట్టి.. చొక్కాను మెడకు బిగించారు. ఇంకో యువకుడు ఇష్టారీతిన తన్నాడు. మెడలో ఉన్న గొలుసును బిగించడంతో అక్కడ తీవ్ర గాయమైంది. బాధితుడు తనను ఏమీ చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. నిందితులు అదే కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదివి మానేసి ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఫోన్ లో వీడియో తీసి ఈ నెల 19న సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. దాడికి పాల్పడినవారు, బాధిత విద్యార్థి మైనర్లే కావడం గమనార్హం. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు కొత్తపేట డీఎస్పీ గోవిందరావు, రాజోలు సీఐ టి.వి.నరేశ్ కుమార్ బుధవారం తెలిపారు.

Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025