మహారాష్ట్ర ముంబైలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పాడలోని నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌పై వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. ట్యాంక్ శుభ్రం చేయడానికి ఐదుగురు లోపలికి దిగారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాగ్‌పాడలోని నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంక్‌ను ఐదుగురు కూలీలు శుభ్రం చేయడానికి లోపలికి దిగారు. దీంతో ఊపిరాడక వారు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాటర్ ట్యాంకులోనే ఉండిపోయారు
ఈ విషయం తెలుసుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌లు, బీఎంసీ వార్డు అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఊపిరాడక అచేతనంగా పడిపోయిన ఐదుగురిని వాటర్ ట్యాంకు నుంచి బయటకు తీశారు. అంబులెన్స్‌ల్లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నలుగురు కూలీలు మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఒక వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025