మహబూబాబాద్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కురవి మండలం పిల్లిగుండ్లతండాలో లింగనిర్ధారణ పరిక్షలు చేస్తుంది ఈ ముఠా. స్కానింగ్‌కు రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన వారికి గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరిక్షలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
పక్కా ప్లాన్‌తో వెళ్లిన పోలీసులకు స్కానింగ్ ముఠా అసలు భాగోతం బయటపడింది. దీంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి స్కానింగ్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే లింగ నిర్ధారణ పరీక్షలు ఎవరు చేసినా చర్య తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం