నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు తిన్న100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన టీచర్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు సురక్షితంగానే ఉన్నారు
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత తీవ్ర ఇబ్బందిపడ్డారు. టీచర్లకు వేంటనే సమాచారం ఇచ్చారు. స్పందించిన సిబ్బంది దగ్గరలో ఉన్న ఓ డాక్టర్లని పాఠశాలకు పిలిపించారు. వీరిలో 15 మంది విద్యార్థులకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. మరో 9 మందిని మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందులో 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండగా వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వాప్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న డీఈవో ప్రభుత్వ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ఫుడ్ పాయిజన్ జరగడం ఇది మూడోసారని డీఈవోతో విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వంట ఏజెన్సీ, హెచ్‌ఎం నిర్లక్ష్యం చేసినందుకు వారిని మార్చాలని డిమాండ్ చేశారు.
మెరుగైన వైద్యం..
ఫుడ్ పాయిజన్ ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో మాట్లాడి పిల్లల పరిస్థితి తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థులను పరామర్శించిన ఫుడ్‌పాయిజన్‌పై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు సీఎం ఆదేశాలతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఇద్దరి సస్పెన్షన్..
ఫుడ్ పాయిజన్ ఘటనతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ స్కూల్ హెచ్ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్చార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎమ్మెల్యేపై సీఎం సీరియస్ అయ్యారు. పని విషయంలో నిర్లక్ష్యం చేసినవారిని సస్పెండ్ చేయాలని హెచ్చరించారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూండా చూడాలన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేదన్నారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం