హైదరాబాద్‌లోని టోలిచౌకిలోని ఓ రెస్టారెంట్‌లో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో నలుగురు విద్యార్థులతో సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
హైదరాబాద్‌లోని టోలిచౌకిలోని ఓ రెస్టారెంట్‌లో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల్లో నలుగురు విద్యార్థులతో సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. చాంద్రాయణగుట్టకు చెందిన ఖాలెద్ కుటుంబ సభ్యులు, టోలిచౌకిలో నివాసముంటున్న అతని సోదరి కుటుంబ సభ్యులు శుక్రవారం ఖాలెద్ ఇంటికి వచ్చారు. శుక్రవారం రాత్రి వీరిలో పదవ తరగతి చదువుతున్న అహ్మద్ బిన్ ఖాలెద్, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థి సయ్యద్ అఫ్నాన్, ఇంజనీరింగ్ విద్యార్థి మహ్మద్ బిన్ ఖాలెద్, ఏడవ తరగతి విద్యార్థి సయ్యద్ అద్నాన్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని లైబా ఫాతిమా, మరో ముగ్గురు యువతులు కలిసి టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో ఉన్న అల్‌వాది యెమిని రెస్టారెంట్‌కు వెళ్లారు.
మాండీ బిర్యానీ తిని తీవ్ర అస్వస్థతకు..
అక్కడ వారు మాండీ బిర్యానీ తిన్నారు. ఆ సమయంలో రెస్టారెంట్ సిబ్బంది వారికి నిషేధిత మయోన్నైస్ (Banned Mayonnaise) కూడా అందించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచే వారందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో.. వారిని ముందుగా సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కోరెంటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
మాండీ బిర్యానీ తిని తీవ్ర అస్వస్థతకు..
అక్కడ వారు మాండీ బిర్యానీ తిన్నారు. ఆ సమయంలో రెస్టారెంట్ సిబ్బంది వారికి నిషేధిత మయోన్నైస్ (Banned Mayonnaise) కూడా అందించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచే వారందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో.. వారిని ముందుగా సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కోరెంటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై ఖాలెద్ స్పందిస్తూ.. ఆదివారం సాయంత్రం రెస్టారెంట్ యజమాని సలాంపై టోలిచౌకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కలుషిత ఆహారం, నిషేధిత మయోన్నైస్ వాడకంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన టోలిచౌకి ప్రాంతంలో ఆందోళన కలిగించింది. ఎనిమిది మంది విద్యార్థులకు ఒక్కసారి అస్వస్థతకు గురి కావటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!