SGSTV NEWS
Andhra PradeshPolitical

గుడివాడలో ఫ్లెక్సీ వార్.. టీడీపీ Vs వైసీపీ.. హైటెన్షన్!-




గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు చింపేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

కృష్ణాజిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా నాగవరప్పాడు సెంటర్ కు చేరుకున్నారు. జై తెలుగుదేశం… గుడివాడ గడ్డ.. రామన్న అడ్డా.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాము చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ క్రమంలో నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీ చింపేందుకు  ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు రాళ్లు విసురుతూ ఫ్లెక్సీ చింపేసినట్లు తెలుస్తోంది. దీంతో నాగవరప్పాడు సెంటర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వైసీపీ సమావేశం జరిగే కే కన్వెన్షన్ కు వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా గుడివాడలో భారీగా పోలీసులు మోహరించారు.

నేడు గుడివాడలో వైసీపీ సమావేశం..
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గుడివాడలోని కే కన్వెన్షన్లో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొడాలి నాని హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొడాలి నానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు చేశారు. కొడాలి నాని సీఎం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. చంద్రబాబు కుప్పంలో గెలిస్తే షూ పాలిష్ చేస్తానని గతంలో నాని సవాల్ విసిరారు. సవాల్ చేసిన సన్నాసి బయటికి రావాలంటూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొడాలి నాని సమావేశానికి వస్తున్నారని తెలిసే టీడీపీ వాళ్లు ఫ్లెక్సీలతో రెచ్చగొడుతున్నారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Also read

Related posts

Share this