SGSTV NEWS
Andhra PradeshCrime

BIG BREAKING: పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఐదుగురు మృతి


ఏపీలోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిషింగ్‌ హర్బర్‌లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలి అయిదుగురు మృతి చెందడం కలకలం రేపింది. నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఫిషింగ్‌ హర్బర్‌ సమీపంలోని హిమాలయ బార్‌ వద్ద వెల్డింగ్ స్క్రాప్‌ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏపీలోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిషింగ్‌ హర్బర్‌లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలి అయిదుగురు మృతి చెందడం కలకలం రేపింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఫిషింగ్‌ హర్బర్‌ సమీపంలోని హిమాలయ బార్‌ వద్ద వెల్డింగ్ స్క్రాప్‌ దుకాణంలో గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు తీవ్రతకు మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాని.. గుర్తుపట్టలేని విధంగా మారాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం ఒక్కసారిగా గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. సమాచారం మేరకు పోలీసులు హుటాహుటీనా ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లారు. అయితే వెల్డింగ్ చేసే సిలిండర్‌ పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Also read

Related posts

Share this