రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు.
హిందూపురం,: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనితల ఆదేశాలతో 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మంగళవారం హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు.
నిందితులను స్థానిక బిట్ కళాశాల వద్ద సోమవారం అరెస్ట్ చేసి, రెండు ద్విచక్రవాహనాలు, రూ.5,200 నగదు స్వాధీనం చేసుకొన్నామని చెప్పారు. ప్రధాన నిందితులు నాగేంద్ర, ప్రవీణ్తో పాటు ముగ్గురు మైనర్లు ఉన్నారని, మరో నిందితుడు చాకలి శ్రీనివాసులు ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితుల్లో మైనర్లను చిల్డ్రన్స్ హోంకు తరలించామన్నారు.
చిలమత్తూరు సమీపంలోని నల్లబొమ్మనపల్లిలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లుకు వాచ్మన్గా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి, భార్య, కుమారుడు, కోడలు, పదిమాసాల బాలుడితో కలిసి ఉంటున్నారు. ఈ నెల 12న వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఆరుగురు నిందితులు వీరిపై దాడి చేసి ఇంట్లో ఉన్న రూ.5,200 నగదు దోచుకొని అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులు ఉదయం 8 గంటలకు చిలమత్తూరు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించి, 11 గంటలకల్లా నిందితులను ప్రాథమికంగా గుర్తించాం. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాల్లో అన్వేషించి వీరిని పట్టుకున్నాం.
38 ఏళ్ల వయసు.. 37 కేసులు
ఈ కేసులో నిందితులంతా హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్కు చెందినవారే. ప్రధాన నిందితుడైన ఎ. కావడి నాగేంద్ర (38)పై ఏపీ, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో 37 కేసులు నమోదయ్యాయి. ఇతను తన బంధువు, అంతర్రాష్ట్ర నేరస్థుడైన దుర్గా వద్ద పనిచేస్తూ దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. మరో ప్రధాన నిందితుడు ప్రవీణ్్ప లేపాక్షి పోలీస్ స్టేషన్లో హత్య కేసు ఉంది. ఇంకో నిందితుడు సి.శ్రీనివాసులు దారిదోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. టైల్స్ పరిశ్రమల్లో పనిచేస్తున్న ముగ్గురు యువకులను ఉపయోగించుకుని వీరు దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు’ అని ఎస్పీ వివరించారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం