తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గరేణిగుంట మండలం, వెదళ్ళ చెరువు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్నింగ్ ట్రావెల్స్కు చెందిన బస్సు బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బస్సులో మంటలను అదుపు చేయించారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.

బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను స్థానిక పోలీసులు చొరవ తీసుకొని గమ్యస్థానాలకు పంపారు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025