అమరావతి : ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఫైల్స్ రోడ్డుపక్కన చెత్తుకుప్ప దగ్గర ప్రత్యక్షం అయ్యాయి.. ఈ గుంటూరులో పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోని చెత్తలో దుండగులు ఫైళ్లను పడేశారు. అయితే, అధికారులు వచ్చేసరికి చెత్తలోని దస్త్రాలు మాయం అయ్యాయి. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తహశీల్దార్ ఫణీంద్ర తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఫైల్స్ దగ్ధం ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. ఈ ఘటనపై సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు..
Also read:
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025