February 24, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Srikakulam Crime: శ్రీకాకుళంలో దారుణం.. చెక్కి ఇచ్చి ఐదో తరగతి బాలికపై అత్యాచారం


శ్రీకాకుళంలో ఐదో తరగతి బాలికపై 47 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. సారవకోటలో చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలో ఒకరికి వేరుశెనగ చెక్కి ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Srikakulam Crime: ఏపీ(AP)లోని శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 47 ఏళ్ల వ్యక్తి ఐదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సారవకోట(Saravakota) మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరూ పిల్లలు చెట్టు దగ్గర ఆడుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన రామారావు ఆ పిల్లలపై కన్నేశాడు. అందులో ఒక పాపకి వేరుశెనగ చెక్కిలు ఇచ్చి ఇంటికి వెళ్లిపోమన్నాడు. తాను వెళ్లను అని చెప్పినా కొట్టి మరి ఆమెను ఇంటికి పంపించాడు

వేరుశెనగ చెక్కిలు ఇచ్చి..
ఇంకో పాపకి కూడా వేరుశెనగ చెక్కిలు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఏడుస్తూ గట్టిగా కేకలు వేయడంతో వెంటనే ఇంటికి పంపించేశాడు. బాలిక ఏడ్చుకుంటూ తీవ్రమైన నొప్పితో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు

ఇదిలా ఉండగా ఇటీవల ఓ పన్నెండెండ్ల బాలికకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి  వేధింపులు వచ్చాయి. నానమ్మ ఫోన్ వాడుతున్న ఆ బాలికకు ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపడంతో ఒకే చేసింది. అదే అదనుగా తీసుకున్న అవతలి వ్యక్తి బాలిక వ్యక్తిగత ఫోటోలను స్ర్కీన్‌ షాట్స్‌ తీసుకుని వాటిని మార్ఫింగ్‌ చేశాడు. అంతటితో ఆగకుండా వాటిని బాలికకు పంపించి భయపెట్టాడు

ఆ ఫోటోలను తీసేయాలంటే బాలికకు చెందిన ప్రైవేటు ఫోటోలను పంపించాలని వేధించాడు. దీంతో ఆ బాలిక ముందు చూపుతో ఆలోచించి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు బాలికను వేధించిన వ్యక్తిని గుర్తించారు

Also read

Related posts

Share via