April 4, 2025
SGSTV NEWS
CrimeUttar Pradesh

యూపీలో మహిళా చోరులు!

లక్నో: ముసుగులు ధరించిన మహిళలు ఆయుధాలు చేతబూని భారీ దొంగతనానికి పూనుకున్నారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దర్జాగా ప్రవేశించి కేవలం 50 నిమిషాల్లో ఉన్నదంతా ఊడ్చేసి గోతాముల్లో నింపుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది.

 

ఈ నెల ఏడో తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఆషియానా పోలీస్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సందీప్ గులాటి ఇంట్లో ఈ మహిళా దొంగలు చొరబడ్డారు. ఒకరిద్దరు ఆయుధాలతో బయట కాపలాగా ఉండిపోగా మిగతా వారు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు సహా ప్రతి వస్తువు తీసుకుని ఐదు బస్తాల నిండా దర్జాగా నింపుకుని నెమ్మదిగా వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

 

Related posts

Share via