విశాఖలో ఓ మానవమృగం కీచకపర్వం వెలుగుచూసింది. వరుసకు కూతురయ్యే మహిళపై అనేక ఏళ్లుగా లైంగికదాడి చేస్తూ గర్భవతినిచేశాడు పెబ్బిలి రవికుమార్ అనే వ్యక్తి. ఆ మహిళ ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
విశాఖలో ఓ మానవ మృగం కీచకపర్వం వెలుగు చూసింది. వరుసకు కూతురయ్యే మహిళపై అనేక ఏళ్లుగా లైంగిక దాడి చేస్తూ గర్భవతినిచేసిన పెబ్బిలి రవి కుమార్ అనేవ్యక్తిపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించిన రవికుమార్ అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి అనుచరురుడిగా తెలిసింది.
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో తర్వాత అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది. కొద్ది కాలానికి తాత కూడా చనిపోవడంతో సొంత పిన్ని, బాబాయ్ అయ్యే రవికుమార్ దంపతులు ఆమెను చేరదీశారు. అయితే చిన్నతనం నుంచే ఆమెపై కన్నేసిన రవికుమార్ భార్యలేని సమయంలో ఆమెపై అనేకసార్లు లైంగికదాడి చేశాడు. ఈ సంఘటన ఆమె పిన్ని కి చెప్పడానికి ప్రయత్నం చేస్తే కిరాతకంగా కొట్టడం హింసించడం చేసేవాడు
ఆమె కు వేరే మార్గం లేకపోవడంతో మానవ మృగం ఉచ్చు లో చిక్కుకుంది. రవికుమార్ ఆ బాలిక సంరక్షణ చూస్తున్నట్లు, ఆమెకు వారసత్వంతో వచ్చిన ఆస్తి వాటా.. నగదు తన దగ్గరే ఉంచుకున్నాడు..ఆమె ను నమ్మించి ఆమె డబ్బులతో స్థలాలు కొంటానని నమ్మించి ఫేక్ స్థలాలు చూపించి తప్పుడు డాక్యుమెంట్లుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది!
కొంతకాలం తర్వాత రవికుమార్ బంధువులు శ్రీకాకుళంకు చెందిన వ్యక్తితో ఆమెకు మొదటి వివాహం జరిపించాడు. కొద్దీ నెలలు గడవకముందే ఆమె భర్తతో గొడవలు సృష్టించి వారిని విడదీశాడు అనంతరం హైదరాబాద్ లోఉన్న బాధిత మహిళను విశాఖకు రప్పించి అనేకమార్లు ఆమెపై లైంగికంగా దాడి చేయడంతో బాధిత మహిళ గర్భం దాల్చింది. లైంగిక దాడి, గర్భం విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఆ మహిళను కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. ఈ క్రమంలో మహిళ కనపడటం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్ మహిళను విజయవాడకు తీసుకొచ్చి రహస్య ప్రసవం చేయించాడు.. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రినని రవి కుమార్ సంతకం చేశాడు.
ఆ తరువాత దగ్గరుండి రెండవ వివాహం జరిపించాడు రవి కుమార్. బాధితరాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు చెందినఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. చేసేదేమి లేక బాధితురాలు 2023లో పెందుర్తి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. అయితే పోలీసులు మోసం, అట్రాసిటీ కేసులు పెట్టి రవికుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దీంతో నిందితుడు పెబ్బిలి రవికుమార్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. ప్రస్తుతం బెయిల్ రద్దు కావడంత పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కాగా ఈ కేసు విషయంలో సదరు మహిళపై కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్న ఆరోపణలున్నాయి
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు