*పట్టించుకోని రాష్ట్రస్థాయి రెవెన్యూ ఉన్నత అధికారులు…*
*కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న కొంతమంది అధికారులు…*
అమరావతి:
ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ గుంటూరులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్లో మీ భూమి ఆన్లైన్ వెబ్ ల్యాండ్ యొక్క ప్రభుత్వ వెబ్ సైట్లో వ్యవసాయ భూముల హక్కుదారులు తమ భూములను వారసత్వంగా రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఇతరులకు అమ్ముకున్న లేదా కోర్టుల ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన ఈ వ్యవసాయ భూములు ప్రస్తుత యజమాని పేరుతో 1 బి, 10 బి అడంగల్ లో, మరియు ప్రభుత్వ రికార్డులలో వీరి పేర్లు మ్యుటేషన్ ద్వారా ఆన్లైన్ వెబ్సైట్లో నమోదు కావాలంటే ఇతరులు అన్న సూచిక దగ్గర యజమానుల పేర్లను వెబ్సైటు తీసుకోవట్లేదు. రెవెన్యూ కార్యాలయాలలో అన్ని ఆధారాలతో ఉన్న ఆ భూ హక్కుదారు పేర్లు ఎక్కిస్తుంటే ప్రభుత్వ వెబ్సైట్ అసలు తీసుకోవట్లేదన్నారు. దీనితో వ్యవసాయ భూముల యజమానులు తమ భూములు అమ్ముకోలేక, ఇతరులకు, తమ వారసులకు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ కారణంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరగక ఆగిపోయాయని శ్రీధర్ తెలియజేశారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు జరగక రెవెన్యూ కూడా తగ్గిపోయిందని, భూ యజమానులు గత కొన్ని నెలలుగా ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న సరే స్థానిక అధికారులు ఉన్నత అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకుంటున్నారన్నారు. కొంతమంది రెవిన్యూ అధికారులు అయితే ఇది CCLA ప్రధాన కార్యాలయం వారు చేయాల్సిన పని తమది కాదని, వారి సాఫ్ట్వేర్ లో ఈ సమస్యను సరిచేయాలనీ చెప్పి మరి తప్పించుకుంటున్నారు. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో తెలియక ఆంధ్రప్రదేశ్లో వున్న అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూముల తాలూకా భూ యజమానులు గందరగోళానికి,తికమకకు గురై ఉన్నారని, భూ యజమానులు ఎన్ని ఫిర్యాదులు స్థానిక రెవెన్యూ అధికారులకు చేసినా సరే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సరే ఏ ఒక్క అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవని, తహసిల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల భూ యజమానుల మ్యుటేషన్ అర్జీలు పరిష్కారం జరగక కట్టలు కట్టలు పేరుకుపోయాయని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తున్నారని శ్రీధర్ వాపోయారు. గత ప్రభుత్వంలో ఇటువంటి సమస్య ఉత్పన్నం అవ్వలేదని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా కావాలని కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో తమకి ఈ గతి పట్టించారని భూ యజమానులు వాపోతున్నారని, అందువల్ల రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సి సి ఎల్ ఏ ఉన్నతాధికారులు తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ యజమానులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించవలసిందిగా శ్రీధర్ ప్రభుత్వ ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు.
Also read
- సరస్వతి విగ్రహానికి చున్నీ కప్పి మరీ ప్రభుత్వ పాఠశాలలో నాన్-వెజ్ పార్టీ ..
- ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే ఏమవుతుంది..? ఇంట్లో జరిగే ప్రతి మార్పుకు ఈ చెట్టు పరోక్షంగా కారణమా..!
- Diwali 2025: దీపావళి రోజున తులసిని ఇలా పూజించండి.. జీవితంలో సిరి సంపదలకు లోటే ఉండదు..
- నేటి జాతకములు.. 14 అక్టోబర్, 2025
- ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూముల ఆస్తి హక్కుదారులు తమ పేర్లను, స్థిరాస్తులను ఆన్లైన్ “మీ భూమి” వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు….*