బొల్లినేని ఆసుపత్రిని ముట్టడించిన కిమ్స్ ఆసుపత్రి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. బొల్లినేని హాస్పిటల్‌లో బలవన్మరణానికి యత్నించింది ఫార్మ్-డీ విద్యార్థిని అంజలి. ప్రస్తుతం ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బొల్లినేని ఆసుపత్రిని ముట్టడించిన కిమ్స్ ఆసుపత్రి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. బొల్లినేని హాస్పిటల్‌లో బలవన్మరణానికి యత్నించింది ఫార్మ్-డీ విద్యార్థిని అంజలి. ప్రస్తుతం ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. బొల్లినేని ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్ విభాగంలో పనిచేస్తున్న అంజలిని.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ దీపక్ లైంగిక వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక .. మత్తు మందు ఇంజక్షన్ తీసుకుంది.
మూడు పేజీల లేఖ
దీపక్ వేధింపులపై మూడు పేజీల లేఖ రాసింది అంజలి. శారీరకంగా, మానసికంగా దీపక్ వేధించాడంటూ లేఖలో వెల్లడించింది. అంజలి స్వస్థలం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి. విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థుల ఆందోళన చేపట్టారు. అంజలి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్
సంఘటన స్థలాన్ని ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీలు రమేష్ బాబు, భవ్యకిషోర్ పర్యవేక్షించారు. అంజలి తండ్రి నల్లపు దుర్గారావు ఫిర్యాదు మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించడంతో రాజానగరం, రాజ మహేంద్రవరం ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి వాసు ఆసుపత్రికి చేరుకున్నారు. అంజలి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పడంతో మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!