తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు
Fake currency : తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా రూ.1,06,58,000/- (ఒక కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు) సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాలో కొంతమంది నకిలీ నోట్లు తయారు చేస్తున్నారనే సమాచారం అందింది. దీంతో పోలీసు బృందాలు నిఘా పెట్టి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ ముద్రించడానికి వాడిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్ రిపేరు చేయించుకున్న ఒక వ్యక్తి మెకానిక్ కు దొంగనోట్లు ఇచ్చాడు. అనుమానంతో ఆనోట్లను పోలీసులకు అందజేయగా ఆరా తీస్తే ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా నకిలీ నోట్లు ముద్రించి ఒక లక్ష అసలు నోట్లకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నట్లు గుర్తించారు. గుంటూరు బాలాజీనగర్ లోని స్లమ్‌ను డెన్‌గా ఏర్పాటు చేసి నకిలీ నోట్లను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. మధు అనే వ్యక్తి ఇంటర్‌నెట్‌లో చూసి దొంగ నోట్లు ఎలా చేయాలో ప్లాన్ చేశాడు. విజయవాడకు చెందిన మధుబాబు మరో వ్యక్తి మణికుమార్‌తో కలిసి నకిలీ నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు. కాగా అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే