June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

వివాహేతర సంబంధం: భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

అంబర్పేట: కట్టుకున్న భర్త పరాయి మహిళతో సహజీవనం చేయడాన్ని ఓ భార్య తట్టుకోలేకపోయింది. ఉంటున్న భర్త ఇంటి చిరునామా ప్రియురాలితో తెలుసుకొని..పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి రెడ్్యండెడ్గా పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. ఈ సంఘటన శనివారం అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీస్ల కథనం ప్రకారం.. రాంనగర్కు చెందిన ప్రవీణ్ కుమార్కు అదే ప్రాంతానికి చెందిన మెర్సీతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ప్రవీణ్ కుమార్ జి ఎస్ టీ ఇన్కంటాక్స్ కన్సల్టెంట్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు.

ఇతని వద్ద పనిచేసే మహిళతో సన్నిహితంగా వ్యవహరించాడు. ఆ మహిళతకు సైతం భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రవీణ్ ఆ మహిళతో కలిసి బాగ్ అంబర్పేట డీడీ కాలనీలో సహజీవనం చేస్తున్నారు. అప్పటినుంచి భార్య మెర్సీ భర్తతో గొడవ పడుతోంది. ఇతని ప్రవర్తనపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా మారకపోవడంతో శనివారం డైరెక్టుగా వారిద్దరు నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లి చితకబాదింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ప్రవీణ్ కుమారు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒకరిపై ఒకరు అంబర్పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. మహిళా పోలీస్టేషన్లో నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉండడంతో న్యాయ సలహా తీసుకొని కేసు విచారిస్తామని ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు.

Related posts

Share via