Singer Kalpana: “అనుకోకుండా ఒకరోజు” సినిమాలో సన్నివేశం గుర్తుందా?. ఇంచుమించు అదే తరహాలో సింగర్ కల్పన విషయంలోనూ జరిగింది. నిద్రమాత్రలు ఓవర్ డోస్ అయ్యేసరికి రోజంతా మత్తులోనే ఉండిపోయింది. చివరికి ఆస్పత్రిలో చేర్చాక స్పృహలోకి వచ్చింది సింగర్ కల్పన. కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె దయ మీడియాతో మాట్లాడారు.
వీడియో
కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదని ఆమె కుమార్తె దయ మీడియాకు తెలిపారు. ఇన్‌సోమ్నియా బాధపడుతూ ఉండటంతో.. డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చారని.. ఆ డోస్ ఎక్కువ అవ్వడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. తమ కుటుంబం హ్యాపీగా ఉందని.. ప్రస్తుతం తన తల్లి LLB, పీహెచ్‌డీ కూడా చేస్తున్నట్లు చెప్పారు. తన తల్లిదండ్రుల మధ్య కూడా ఎలాంటి విబేధాలు లేవని వివరణ ఇచ్చారు. దయచేసి తప్పుడు వార్తలు సర్కులేట్ చేయోద్దని కల్పన కుమార్తె కోరారు. త్వరలోనే కల్పన డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.
హైదరాబాద్ KPHBలోని విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి తనకు మత్తుగా ఉందని.. అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పారని సమాచారం. ఆయన వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచామిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కల్పన ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
Also read
- కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి
- Hyderabad: అనుమానాస్పదంగా ఫుడ్ డెలివరీ బాయ్.. డౌట్ వచ్చి.. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా
- HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి
- Hyd Drugs: గంజాయి ఐస్‌క్రీమ్‌తో ఎంజాయ్.. హోళీ వేడుకల్లో పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. షాకింగ్ వీడియో!
- AP News: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా