సీనియర్ హీరోయిన్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను బెదిరిస్తోన్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారుకీడుస్తానని.. తమను చంపుతామని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు
టాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను బెదిరిస్తోన్న చంద్రశేఖర్ అనే వ్యక్తిపై బంజర హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమను చంపుతామని బెదిరిస్తున్నాడని, తమ అంతు చూస్తామని చంద్ర కిరణ్ రెడ్డి మెసేజ్స్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారుకీడుస్తానని.. ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ విజయశాంతి దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే చాలా సంవత్సరాలుగా సినీరంగానికి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమా విడుదల కానుంది.
విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు కొన్నిరోజుల క్రితం చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో విజయశాంతి అకౌంట్ మెయిన్ టైన్ చేయాలని శ్రీనివాస్ కోరారు. కొన్ని రోజుల పాటు విజయశాంతి గురించి ప్రచారం చేయాలని.. పనితీరు నచ్చితే కాంట్రాక్ట్ చేసుకుందామని చెప్పారు. ఆ సమయంలో అతడికి కొద్ది మొత్తంలో అందజేశారు. కానీ అతడి పనితీరు నచ్చకపోవడంతో అతడిని ఆఫీస్ నుంచి పంపించారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన చంద్రశేఖర్.. ఇప్పుడు శ్రీనివాస్ ప్రసాద్ కు మెసేజ్ చేస్తూ డబ్బులు పంపించాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే విజయశాంతి దంపతులకు చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ పరువు తీస్తానని.,. ఇద్దరిని చంపేస్తానని మెసేజ్స్ చేస్తున్నాడని శ్రీనివాస్ ప్రసాద్ పోలీసులను ఆశ్రయించడంతో చంద్రకిరణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..