SGSTV NEWS
CrimeTelangana

‘ఢీ’షో డ్యాన్సర్ కావ్య కల్యాణి ఆత్మహత్య.. అతడే కారణమంటూ సెల్ఫీ వీడియో..!

ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారమయ్యే రియాలిటీ షో లో డాన్సర్‌గా చేస్తున్న కావ్య కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడింది. డాన్సర్ అభిలాష్ కారణం అంటూ సూసైడ్ ముందు సెల్ఫీ‌లో పేర్కొన్న యువతి.. ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.


తనని పెళ్ళి చేసుకుని తనతో కాపురం చేస్తూ ఇప్పుడు మరో యువతిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని మంగళగిరి కావ్యకళ్యాణి(24) బలన్మరణానికి పాల్పడింది. మృతురాలు స్వస్థలం ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీ. నిందితుడి స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం పోన్నెకల్. 5 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో నగరంలోని మామిల్లగూడెంలోని సాయిబాబా గుడి సమీపంలో సహజీవనం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో పొన్నేకలు మకాం మార్చారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత అభిలాష్ కు మరో అమ్మాయితో పెళ్లికి సిద్దం అయ్యారు కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న కల్యాణి పొన్నెకల్‌లోని అభి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి యువతి మృతదేహాన్ని తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Also read

Related posts

Share this