November 21, 2024
SGSTV NEWS
CrimeLok Sabha 2024National

ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత

శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం

ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ప్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది.

శంషాబాద్, చౌటుప్పల్ గ్రామీణం, న్యూస్టుడే: ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. ఆభరణాలకు రసీదులు లేకపోవడంతో పోలీసులకు అప్పగించారు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన వ్యాపారులు రాజస్థాన్, ముంబయిల నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలను సామగ్రి మాటున కార్గో విమాన సర్వీసుల్లో ఇక్కడికి తరలిస్తున్నట్లు ఫ్లయ్యింగ్ స్క్వాడ్కు సమాచారం అందింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా పెట్టారు. మొదటి రోటరీ వద్ద వాహనాలను తనిఖీలు చేయగా రెండు కార్లలో తరలిస్తున్న ఆభరణాల పెట్టెలు దొరికాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

మరో ఘటనలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద 5.96 కిలోల బంగారాన్ని గురువారం డీఆర్ఎ అధికారులు పట్టుకున్నారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు ఓ కారులో నలుగురు వ్యక్తులు 35 బంగారం ముక్కలను తరలిస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు డీఆర్ఎ అధికారులు టోల్ ప్లాజా వద్ద కాపు కాసి కారును పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.4.31 కోట్లు ఉంటుందన్నారు.

Also read

Related posts

Share via