April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimeTelangana

Betting App Case: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ED ఎంట్రీ.. వణికిపోతున్న సెలబ్రిటీలు!


తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా 11 మందికిపైగా సెలబ్రెటీలపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఆరా తీసింది.

Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting) యాప్స్ ప్రమోటర్స్ పై వరుసగా కేసులు నమోదు కావడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వారిని కటకటాల్లోకి పంపిస్తున్నారు. నిబంధనలను పక్కన పెట్టి.. యువతను తప్పుదోవ పట్టించి.. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించొచ్చని బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలందరిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురి అరెస్టు చేశారు.

ఎంటరైన ఈడీ
రీసెంట్‌గా మరో 11 మందికిపైగా సెలబ్రెటీలపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంత వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారమంతా పోలీసుల అదుపులో ఉంది. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోకి ఈడీ (Enforcement Directorate) ఎంటర్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ ఆరా తీసింది

అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్‌ ప్రమోటర్స్ చెల్లింపుల వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పోలీసులు ఇప్పటి వరకు నమోదు చేసిన కేసు వివరాలను అడిగి తమ వద్దకు తెప్పించుకుంది. దీంతోపాటు ఈడీ పలు విషయాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హవాలా రూపంలో చెల్లింపులు, మనీ లాండరింగ్ వంటివి జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది

ఇదిలా ఉంటే గతంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన 11మందిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. వారితో పాటు ఈ వ్యవహారంలో ఉన్న మరికొందరికి హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్ల కారణంగా ఎవరైనా బెట్టింగ్‌‌లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు పక్కా ఆధారాలతో దొరికితే దాదాపు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఖాయమని అన్నారు. ఈ వ్యవహారంలో ఉన్న ఎవ్వరినీ వదలమని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Also read

Related posts

Share via