వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. పందిరి వెంకటనారాయణ 57 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంకటనారాయణ దగ్గర నుంచి రూ.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారం, 3.64 కేజీల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. వెంకటనారాయణ దొంగిలించిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడుపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025