శివరాత్రి ముందు గుజరాత్ లోని ద్వారకా ఆలయంలో శివలింగం చోరీకి గురైంది. ఈ సంచలనం సృష్టించిన దొంతనం మిస్టరీ ఎట్టకేలకు వీడింది. గుజరాత్‌కి చెందిన ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా, తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని దొంగిలించినట్లు తేలింది
మహా శివరాత్రి పండక్కి ఒక్కరోజు ముందు దారుణం జరిగింది. ఓ ఆలయంలో రాతి శివలింగం చోరీ అయింది. ఈ ఘటన గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. ఉదయం ఆలయానికి వచ్చేసరికి ఆలయ తలుపులు తెరిచి ఉన్నాయని.. లోపలికి వెళ్లి చూసేసరికి శివలింగం లేదని ఆలయ పూజారి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పురాతన శివాలయంలోని శివలింగాన్ని పునాదితో సహా పెకిలించి దొంగిలించారని ఆలయ పూజారి ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ దొంగతనం కేసు గుజరాత్ లో సంచలనంగా మారింది. దాంతో అక్కడి పోలీసులు, అధికారులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపరీతంగా సోధించి మొత్తానికి దొంగలను పట్టుకున్నారు. అయితే దొంగలు దొరికాక…వారు చెప్పిన విషయాలు పోలీసులను మరింత విస్మయానికి గురిచేశాయి. గుజరాత్‌కి చెందిన ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా.. తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని దొంగిలించినట్లు తేలింది. ఈ కేసులో కుటుంబంలోని 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ కుటుంబంలో ఒక అమ్మాయికి ఒక కల వచ్చిందట. దానిని అనుసరిస్తూనే ఫ్యామిలీ వారు శివలింగాన్ని చోరీ చేశారు. మహేంద్ర మక్వానా అనే వ్యక్తి మేనకోడలుకు భీద్బంజన్ మహాదేవ్ ఆలయంలోని శివలింగాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్టించడం వల్ల వారి సమస్యలు తొలిగిపోయి, మంచి జరుగుతుందని కల వచ్చింది. దీన్ని ఆ కుటుంబం మొత్తం నమ్మింది. అంతే ఇంకుముంది కట్టకట్టుకుని గుడికి వెళ్ళి శివలింగాన్ని పెకిలించి తీసుకుని వచ్చేశారు. దొంగతనానికి ముందు ద్వారకాలో కుటుంబం మొత్తం వారం రోజులు ఉంది. తరువాత దాన్ని ఇంటికి తీసుకువచ్చి మహాశివరాత్రి నాడు దానిని ఇంట్లో ప్రతిష్టించుకున్నారు.
ఈ కేసులో మహేంద్రతో పాటు కుటుంబంలోని ముగ్గురు మహిళలతో పాటు వనరాజ్, మనోజ్, జగత్ అనే మరో ముగ్గురిని కూడా ద్వారకా పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన శివలింగాన్ని స్వాధీనం చేసుకుని, ద్వారకలోని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..