SGSTV NEWS
Andhra Pradesh

డీఎస్పీ జయసూర్య మంచి వారే : రఘురామ భీమవరం

డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మిని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరారు.

భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మిని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం డీఎస్పీ జయసూర్య ఓ మంచి అధికారి అని, జయసూర్యపై పవన్‌కు ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారు. గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం అనేది సహజమన్నారు. 13 ముక్కలాట నేరం కాదని, కానీ పేకాటపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు.

ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ జిల్లా ఎస్పీ నయీంతో ఫోన్లో మాట్లాడారు. పేకాట విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారని ఆరా తీశారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాతో కూడా డిప్యూటీ సీఎం ఫోన్లో మాట్లాడారు. పేకాట, డీఎస్పీ జయసూర్య పాత్ర, వ్యవహారశైలిపై నివేదిక కోరారు. పేకాట నిర్వాహకులపై గేమింగ్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేయాలని, నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Also read

Related posts