ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొంత మంది కేటుగాళ్లు ఏకంగా మహిళ ఎస్సైపైన దాడులకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు మహిళలను, యువతులను వేధింపులకు పాల్పడే ఆకతాయిలు..ఈ సారి పోలీసు అధికారిణిని వేధించడం మాత్రం ఏపీలో షాకింగ్ కు గురిచేసే అంశంగా మారింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామంలో ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ జాతకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు భారీగా హజరయ్యారు. దీనిలో కొంత మంది పొకిరీలు తప్పతాగి.. అశ్లీల డ్యాన్స్ లు చేశారు. అంతే కాకుండా అక్కడున్న మహిళలు, యువతుల్ని వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్సై బి.దేవి వారిని వారించే ప్రయత్నం చేశారు.
దీంతో పొకిరీలు మరింత రెచ్చిపోయారు. లేడీ ఎస్సైతో వాగ్వాదంకు దిగారు. తాగిన మైకంలో మహిల ఎస్సైను నోటికొచ్చినట్లు తిట్టి.. దాడి చేసి జుట్టును సైతం పట్టుకున్నారు. దీంతో సదరుఅధికారిణి భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టింది. అయిన కూడా పొకిరీలు ఆమెను వదల్లేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఈ ఘటనకు కారణమైన 9 మంది పొకిరీలను అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు చేపట్టారు.
ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ఏపీలో మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగాయి. డ్యూటీల్లో ఉన్న లేడీ అధికారులకు సైతం.. సెఫ్టీ లేదని అపోసిషన్ పార్టీలు కూటమి ప్రభుత్వంను విమర్శిస్తున్నాయి. ఈ ఘటనలో లేడీ ఎస్సైకి గాయాలు కూడా అయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఆగ్రామంలో అదనపు బలగాలను మొహరించి, కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..