ఇందిరానగర్ లో మలేరియా మృతుల కుటుంబ సభ్యులతో అభ్యుదయ పెయింటర్స్ & ఆర్టిస్ట్స్ వారు నిర్వహించిన ఐ.యఫ్.టి.యు వారు నిర్వహించిన సమావేశం.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ ఇటీవల నిడదవోలు శివారు బట్టీలపేటకు చెందిన చిన్నం మురళి, మరియు ఇందిరా నగర్ కు చెందిన బేజా అన్నవరం అను ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు (పెయింటర్స్) మలేరియా విషజ్వరంతో అతి చిన్న వయసులోనే అకాల మరణం చెందారనీ . వీరు ఇద్దరూ సుమారు 30 సం” ల వారేననీ, వీరిలో మురళీ గారికి 10 సంవత్సరాల లోపు ఇద్దరు చిన్నపిల్లలు, మరియు అన్నవరం గారికి ఇంటర్ చదివే అబ్బాయి మరియు పెండ్లికి ఎదిగిన ఒక ఆడపిల్ల వున్నారనీ. చిన్న వయసులోనే కుటుంబ పెద్ద లను కోల్పోయిన వారివురి భార్య పిల్లలు ప్రస్తుతం ఇంటి అద్దెలు చెల్లించుకోలేక, కనీసం తినటానికూడా లేని దుర్భర పరిస్థితుల్లో వున్నారనీ. గతంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి లేదా చంద్రన్న భీమా, వై.యస్సార్ భీమా నుండి గాని ఎంతోకొంత ఆర్ధిక సహాయం పొందేవారనీ, ఆయా మృతుల కుటుంబాలకు కొంత ఊరట లభించేది, ఐతే ప్రభుత్వం మారిన ప్రస్తుత తరుణంలో మలేరియా తో హఠాత్తుగా మరణించిన వీరి కుటుంబాలకు పై ఏవిధమైన ఆర్థిక భరోసా అందని ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకొని నిడదవోలు పట్టణం మరియు పరిసరాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, దాతృత్వం కల దాతలు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, మానవతా వంటి స్వచ్ఛంద సంస్థల వారు వివిధ అసోసియేషన్ లో వారు స్పందించి ఏ ఆధారం లేని వారి కుటుంబాలను ఆదుకోవాలని యూనియన్ నాయకులు మరియు కుటుంబ సభ్యులు కోరడమైనది.
Also read : గుహల్లో బండరాళ్ల మధ్య పోలీసుల తనిఖీలు.. వెలుగులోకి నివ్వరపోయే దృశ్యాలు..
పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ సురేష్ కుమార్, యల్లమిల్లి వరప్రసాద్, గుంటు సూరిబాబు, యాదాల రమణ,యెలగాడ రాజ్ పాల్, యాదాల ప్రసన్న, గుంటు రాజీవ్, పులుగు చైతన్య, కార్తీక్ తదితరులు నాయకత్వం వహించారు.
దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాలను ఆదు కొనేందుకు క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించి సహాయం చేయాలని కోరుచున్నాము.
ఫోన్ పే నెంబర్స్:
1)యల్లమిల్లి వరప్రసాద్:
9908514923
2) యెలగాడ రాజ్ పాల్
9618034588