SGSTV NEWS
CrimeTelangana

Domestic violence : గృహ హింస కేసు..యువకుడి ఆత్మహత్య.. మహిళా సీఐపై కేసు నమోదు


కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. భార్యభర్తల మధ్య వచ్చిన గొడవలతో భార్య తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. అయితే దీన్ని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Domestic violence : కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. భార్యభర్తల మధ్య వచ్చిన గొడవలతో భార్య తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. అయితే దీన్ని అవమానంగా భావించిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దానికి కారణమైన సీఐపై చర్యలు తీసుకోవాలని మృతుని తరుపు వారు డిమాండ్‌ చేయడంతో సీఐ శ్రీలతపై కేసు నమోదైంది. ఈ ఘటన  పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఈ మేరకు సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తమ కొడుకు మృతికి సీఐ శ్రీలతతో పాటు అత్తింటి వారి వేధింపులే కారణమని మృతుడి తండ్రి కడారి లింగయ్య ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది. చొప్పదండికి చెందిన కడారి శ్రావణ్ కుమార్ కు కరీంనగర్ కు చెందిన బత్తుల నీలిమతో 2021 లో వివాహం అయ్యింది.అయితే  తరుచుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నీలిమ తన భర్తపై గృహహింస కేసు పెట్టింది.ఈ  కేసులో బయటకు రాకుండా చేస్తానని సీఐ శ్రీలత శ్రావణ్‌ ను బెదిరించారని.. భయంతో తనకొడుకు కడారి శ్రావణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ లింగయ్య ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐతో పాటు మృతుడి భార్య బంధువులపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


కడారి శ్రావణ్ కుమార్, బత్తుల నీలిమకు నాలుగేండ్ల పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా 2024లో నీలిమ తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పలుమార్లు మాట్లాడుకున్నప్పటికీ కలహాలు పరిష్కారం కాలేదు. దీంతో నీలిమ కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కాగా స్టేషన్‌ సీఐగా ఉన్న శ్రీలత తన కొడుకును బెదిరించిందనీ..కేసునుంచి బయటకు రాకుండా చేస్తానని వార్నింగ్‌ ఇచ్చిందని తండ్రి లింగయ్య ఆరోపించారు. ఈ కేసులో స్టేషన్‌కు రావాలని స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందని, స్టేషన్ కు వెళితే కొడతారనే భయంతో తన కుమారుడు పురుగుల మందు తాగి చనిపోయినట్లు మృతుడి తండ్రి  చొప్పదండి స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ శ్రీలతతో పాటు కోడలు నీలిమ, మరో ఐదుగురిపై కేసు నమోదైంది.


Also read

Related posts

Share this