SGSTV NEWS
CrimeNational

ప్రేమించుకున్నది చాలు, పెళ్లి చేసుకొందామా?



యశవంతపుర: ప్రేమించిన యువతితోనే జీవితం అనుకున్నాడు.  కానీ ఆమె పెళ్లికి ససేమిరా అనడంతో ప్రాణాలే తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హాసన జిల్లా అరసికెరె తాలూకా బైరగొండనహళ్లి గ్రామంలో జరిగింది. దర్శన్ (22) బేవినహళ్లిలోని అవ్వ ఇంటిలో ఉంటూ కాలేజీకి వెళ్లేవాడు. బేవినహళ్లికి చెందిన యువతి, దర్శన్ ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.

బీఏ పూర్తి చేశాక సొంతూర్లో సేద్యం చేస్తున్నాడు. ప్రేమించుకున్నది చాలు, పెళ్లి చేసుకొందామా? అని దర్శన్ యువతిని అడిగాడు. కానీ ఆమె ఇందుకు నిరాకరించింది. దీంతో విరక్తి చెందిన దర్శన్ ఈ నెల 5న ఇంటిలో పురుగుల మందు తాగాడు. అస్వస్థతకు గురైన దర్శన్ వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు.

స్నేహితులు రవి, యశ్వంత్లు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పి కుప్పకూలిపోయాడు. అతనిని అరసికెరె ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మైసూరు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. అరసికెరె గ్రామీణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Also read


Related posts

Share this