లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేయండి. ఇంట్లో డబ్బు పెరగాలని, ప్రశాంతత, సంతోషం ఉండాలని వాస్తు ప్రకారం కొన్ని పద్ధతులను పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇలా చేయండి.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని రకరకాల పద్ధతులను, పరిహారాలను పాటిస్తూ ఉంటారు. కొన్ని పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి చాలామంది వివిధ పరిహారాలను పాటిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే సూర్యాస్తమయం సమయంలో ఈ పనులు చేయండి.
ఇంట్లో డబ్బు పెరగాలని, ప్రశాంతత, సంతోషం ఉండాలని వాస్తు ప్రకారం కొన్ని పద్ధతులను పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇలా చేయండి.
డబ్బు రావాలంటే సూర్యాస్తమయం సమయంలో ఇలా చేయండి:
1.ముఖద్వారం దగ్గర దీపారాధన:
వాస్తు ప్రకారం దీపారాధన చాలా ముఖ్యమైనది. ఇంటి ముఖద్వారం దగ్గర దీపారాధన చేయండి. ప్రతిరోజు సూర్యాస్తమయం సమయంలో ముఖద్వారం దగ్గర దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సింధూరంతో స్వస్తిక్ గుర్తును ప్రధాన ద్వారం దగ్గర వేయండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి మరియు సంతోషంగా ఉండవచ్చు.
2.వంటగదిలో నీరు నిండుగా ఉంచండి:
రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో నీరు నిండుగా ఉండేటట్టు చూడండి. నీటి బింది నిండుగా ఉండాలి. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
3.బాత్రూంలో బకెట్ ఖాళీగా ఉంచకండి:
వాస్తు ప్రకారం బాత్రూంలో బకెట్ ఖాళీగా ఉండడం మంచిది కాదు. నిండుగా ఉండేటట్టు చూసుకోండి. ఇది సంపాదనను తీసుకువస్తుంది మరియు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది.
ఈ పొరపాట్లు చేయకండి:
లక్ష్మీదేవి ఇలాంటి ఇళ్లల్లో ఉండదని గుర్తుపెట్టుకోండి. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. ఎప్పుడూ కూడా వంటగదిలో గిన్నెలు శుభ్రంగా ఉండాలి. వాటిని మురికిగా ఉంచకూడదు. లేదంటే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది మరియు కష్టాలు వస్తాయి.
ఇంటి ముఖద్వారం ఎప్పుడూ మురికిగా ఉండకూడదు. ఇంటి ముఖద్వారం ఎదురుగా పనికిరాని సామాన్లు లేదా అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖద్వారం దగ్గర శుభ్రంగా ఉంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది.
