ఆత్మహత్య చేసుకుంటామని వీడియో విడుదల వారి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరుమండలం లోపూడిలో ఓ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారనే కథనం ఆదివారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది. పోలీసుల కథనం మేరకు.. లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకారావు నాటు సారా విక్రయిస్తుంటాడు. ఇటీవల ఎక్సైజ్ అధికారులు అతనిపై కేసు నమోదు చేయగా, న్యాయస్థానం నాలుగు రోజులు రిమాండ్ విధించింది. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కుల పెద్దలు పంచాయితీ పెట్టి బాధితుడి కుటుంబాన్ని మోకాళ్లపై నిలబెట్టారు. నాటు సారా విక్రయాలు మానేయాలని, రూ. లక్ష జరిమానా కట్టాలని ఆదేశించారు. లేకుంటే కుల బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. దానికి కనకారావు అంగీకరించలేదు.
దాంతో ఈ నెల 3న కులస్థుల ఇళ్లకు వెళ్లి.. కనకారావు కుటుంబాన్ని కులం నుంచి వెలి వేశామని, ఎవరూ వారితో మాట్లాడొద్దని కుల పెద్దలు హుకుం జారీ చేశారు. మనస్తాపానికి గురైన కనకారావు.. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నామని, దానికి కుల పెద్దలైన సుదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు, వీరంకి గంగరాజు, పంది శ్రీనివాసరావు, ఆరేపల్లి నాగేశ్వరరావు, శ్రీరాములు కారణమని పేర్కొంటూ సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఆదివారం ఉదయం విడుదల చేశారు. అనంతరం ఆ కుటుంబం అదృశ్యమైంది. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కుల పెద్దలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Also read
- చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
- పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!





