November 22, 2024
SGSTV NEWS
Andhra Pradesh

గోదావరిపై గామన్ వంతెన ప్రకంపనల్లో వ్యత్యాసం



తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైపు గామన్ వంతెనపై ఆదివారం సాయంత్రం ప్రకంపనల్లో వ్యత్యాసం రావడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.

కొవ్వూరు పట్టణం, చాగల్లు, : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైపు గామన్ వంతెనపై ఆదివారం సాయంత్రం ప్రకంపనల్లో వ్యత్యాసం రావడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కొవ్వూరు- రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై ఉన్న ఈ వంతెన 52వ స్తంభం వద్ద యాక్షన్ జాయింట్ బేరింగ్లో సమస్య తలెత్తిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో టోల్ ప్లాజా మేనేజర్ రాజీవ్యాదవ్, సిబ్బంది ఆ ప్రదేశాన్ని పరిశీలించి ఒకవైపు ట్రాఫిక్ నిలిపివేశారు. పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు మేనేజర్తో మాట్లాడి ఉన్నతాధికారులు, నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. ఈ విషయమై ఆర్అండ్ బీ ఆర్డీసీ డివిజన్ ఈఈ శ్రీకాంతన్ ‘మీడియా ‘ సంప్రదించగా వంతెనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. సోమవారం ప్రత్యేక నిపుణులు రానున్నారని, బేరింగ్లో సమస్య ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పారు.

Also read

Related posts

Share via