తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు
Tirumala: తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ంపదించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ”తిరుపతి ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదన చెందాను.
భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా. క్షతగాత్రులకు సత్వరమే మెరుగైన వైద్యసేవలు అందంచాలని వైద్యారోగ్య శాఖకు సూచించినట్లు పవన్ చెప్పుకొచ్చారు.
సహాయ సహకారాలు..
మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు సూచిస్తున్నాను. మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి,వారిని పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలైన్ల నిర్వహణలో అధికారులకు , పోలీసు సిబ్బందికి జనసేన నాయకులతో పాటు జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఙప్తి చేస్తున్నాను అని పవన్ కల్యాన్ పేర్కొన్నారు
Also read
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత
- భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..