April 17, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

వైసీపీ నేత డాబా హౌస్ కూల్చివేత

తిరుపతి జిల్లా : చంద్రగిరి మండలం నారాయణ కాలేజీ వద్ద వైసీపీ నేత ప్రవీణ్ కుమార్ కు చెందిన డాబా హౌస్ ను దుండగులు కూల్చివేశారు. అర్ధరాత్రి సమయంలో ముఖాలకు మంకీ క్యాప్ లు వేసుకొని వచ్చిన దుండగులు మొదటగా డాబాలో పనిచేసే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వంట తయారీ సిబ్బందిపై దాడి చేశారు. ఆపై జెసిబితో దాబా గోడలు, రేకులతో నిర్మించిన గదులు కూల్చివేశారు.

Also read :Suicide: అప్పుల బాధతో గృహిణి ఆత్మహత్య

డాబాలో రికార్డింగ్ అవుతున్న సీసీ కెమెరాలు ధ్వంసం, హార్డ్ డిస్క్ వెంట తీసుకెళ్ళారు. సంఘటన జరిగిన అర్ధగంటలో చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి మండలం అనంత గురప్పగారిపల్లి పోలింగ్ బూత్ కు వైసీపీ తరపున ఏజెంట్ గా ప్రవీణ్ కుమార్ ఉన్నారు. రాజకీయ కక్షతోనే తెలుగుదేశం వారు తన డబా కూల్చివేశారంటున్న దాబా యజమాని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఓ రైతు దగ్గర పట్టాభూమిని లీజుకు తీసుకుని దాబా ఏర్పాటు చేసుకున్నారు.

Also read :Muchumarri case – బాధిత బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం : హోం మంత్రి అనిత

బ్రతుకు దెరువు పోయిందన్న ఆవేదనతో ప్రవీణ్ కుమార్ కుటుంబీకులు కన్నీరు పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సతీమణి లక్ష్మీ, ఆయన సోదరుడు రఘునాథ రెడ్డిలు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు పరామర్శించారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసినప్పటి నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు, దాడులు ఎక్కువగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read :Vijaysai Reddy: మదన్‌ నన్ను రెండుసార్లు కలిశాడు.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి

Related posts

Share via