June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshPolitical

అన్న ఎన్టీఆర్ ని టచ్ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు…

*గుంటూరు నగరంలో ఎన్టీఆర్ స్టేడియం పేరు మార్పు శిలాఫలకాల కూల్చివేత...*

*ఎన్టీఆర్ జిమ్ గా నామకరణం చేసిన బ్రాహ్మణ చైతన్య వేదిక...*అమరావతి
                         : 



ఎవరైనా అన్న ఎన్టీఆర్ నీ టచ్ చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని *ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరించారు.* నగరం నడిబొడ్డున అన్న నందమూరి తారక రామారావు గారి పేరుతో ఎన్ టి ఆర్ స్టేడియం గా ఏర్పాటై ప్రతి రోజూ ఎంతో మందికి నడక, వ్యాయామంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ నగర వాసుల దినచర్యలో భాగమైన ఎన్ టీ ఆర్ స్టేడియం పేరు మార్చాలని వైసీపీ సైకోలు చేసిన కుట్రలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక న్యాయ పోరాటం ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న వాకింగ్ ట్రాక్ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు మద్య దొడ్డిదారిన నిబంధనలకు విరుద్దంగా గుట్టుగా వైఛీపీ మూకలు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం జరిగింది. శిలాఫలకాల తొలగింపు కార్యక్రమంలో స్థానిక వాకింగ్ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ నూతన భవనానికి ఎన్టీఆర్ జిమ్ గా నామకరణం చేసి ఎన్టీఆర్ జిమ్ అనే పెద్ద అక్షరాలతో బిల్డింగ్ బయట బోర్డు అమర్చడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ
గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం లో నూతన భవనానికి వైయస్సార్ జిమ్ మరియు వైయస్సార్ స్టేడియం గా పేరు మార్చేందుకు కుట్ర పన్నడం దుర్మార్గ చర్య అన్నారు.  ఇందుకోసం ఒక నూతన భవనం నిర్మాణం చేపట్టారు. దీనిపైన వారి కుట్రను పసి గట్టిన  బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం  జరిగింది. నిర్మాణం ఆపకుండా మున్సిపల్ అధికారులు, వైసిపి ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణం చేపట్టడం జరిగింది.  హైకోర్టులో పిల్ పెండింగ్ లో ఉండగా ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ ఉందనే కనీస విజ్ఞత, భయం లేకుండా రాష్ట్ర మాజీ మంత్రి విడుదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, టీడీపీ ఓట్లతో గెలిచిన పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి తదితర వైసిపి నేతల పేర్లతో శిలాఫలకాలు ప్రారంభించేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. వీరి పైన ఎన్నికల కమిషన్ నేటి వరకు చర్యలు తీసుకోలేదు.  జగన్ రాక్షస పాలనలో గుంటూరు నగరంలో అరాచకాలకు ఇది ఒక పరాకాష్ట  అని, టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఈ స్టేడియాన్ని కౌన్సిల్లో తీర్మానం చేసి ఎన్టీఆర్ స్టేడియంగా పేరు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అయితే విజయవాడ నగరంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని తొలగించి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా ఇదే జగన్ ప్రభుత్వం మార్పు చేసిందని, అలానే గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియం ను వైయస్సార్ స్టేడియం గా పేరు మార్చేoదుకోసం కుట్రపన్ని మున్సిపల్ అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై ఈ అరాచకానికి పాల్పడ్డారన్నారు. దీనిపైన తాను హైకోర్టులో పిల్ వేయగా వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాపై ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. అయినప్పటికీ వైసిపి వారి బెదిరింపులకు ఎక్కడా తల వొగ్గకుండా కోర్టులో ఈ కేసు కొనసాగించామని తెలిపారు. ఎన్నికల నియమాలకు విరుద్ధంగా శిలాఫలకాలని ప్రారంభిస్తే బ్రాహ్మణ చైతన్య వేదిక చూస్తూ ఊరుకోదన్నారు. ఎన్టీఆర్ అభిమానులు, వాకింగ్ ట్రాక్ సభ్యులు కలిసి ధ్వంసం చేయడం జరిగిందన్నారు. కార్పొరేషన్ లో 49 లక్షల రూపాయలు ఈ భవన నిర్మాణానికి కేటాయింపులు చేస్తే, మున్సిపల్ రికార్డ్స్ లో ఎక్కువ నిధులు కేటాయించినట్లుగా చూపబడిందన్నారు. కాబట్టి దీనిలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కాజేసి దుర్వినియోగం చేశారని, దీనిపైన తక్షణమే ఆడిట్ చేపించి ప్రభుత్వ విచారణ చేసి ఆ డబ్బును మరలా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి తెచ్చే విధంగా చంద్రబాబు గారి నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అనేది ఒక బ్రాహ్మణ కులం కోసం మాత్రమే పనిచేసేది కాదని, అన్ని సామాజిక వర్గాలు, మత వర్గాలు, ముఖ్యంగా టీడీపీ కోసం, ప్రజా సమస్యల పైన బ్రాహ్మణ చైతన్య వేదిక పోరాడుతుఃదన్నారు. ఎప్పుడూ వారికి అండగా ఉంటుందని, దానిలో భాగంగానే ఈ రోజున వాకింగ్ ట్రాక్ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గుంటూరు నగరంలో ప్రయత్నం చేస్తే దాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా అడ్డుకుందని శ్రీధర్ తెలియజేశారు. ఎన్టీఆర్ పట్ల ఎవరు అవమానకరంగా ప్రవర్తించినా, పరిణామాలు ఇలానే తీవ్రంగానే ఉంటాయని శ్రీధర్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, మాజీ యువత అధ్యక్షుడు కొమ్మినేని సాంబశివరావు, సవరం రోహిత్, షేక్ ఖాదర్ బుడే, షేక్ జిలాని, షేక్ బాజీ, తెలగతోటి సుధీర్, జొన్నలగడ్డ ఉదయభాను, నల్లపనేని అమర్నాథ్, కొనకళ్ళ సత్యం, వలివేటి కృష్ణ, బెల్లంకొండ జయచంద్ర, బ్రాహ్మణ సంఘ నాయకులు కొప్పర్తి సీతారమేష్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఎండపల్లి శబరి, వంగవీటి చైతన్య, చిలుమూరు ఫణి, నందివెలుగు చందు, వడ్డమాను ప్రసాదు , మరియు కనపర్తి శ్రీనివాసరావు, నూతలపాటి గోపి తెలుగు యువత నరేష్ గుత్తికొండ శ్రీనివాస్, మరియు ఎన్టీఆర్ వాకింగ్ ట్రాక్ సభ్యులు ఎన్టీఆర్ అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలదండలు లేసి పురోహితులు పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు తప్పెట్లు, తీన్మార్ల తో బృందావన్ గార్డెన్ సెంటర్ ను మోత పుట్టించారు.

Also read

Related posts

Share via