చైతన్యానంద సరస్వతి లైంగిక వేధించిన కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసి షాక్ అయ్యారు. బాబా విద్యార్థినులను అసభ్యకరంగా మెస్సేజ్‌లు పంపడమే కాకుండా.. వారిని విదేశాలకు పంపేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు
ఢిల్లీ బాబాగా పిలవబడే స్వామీ చైతన్యానంద సరస్వతి(Chaitanyananda Saraswati) లైంగికంగా వేధించిన ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన ఫోన్‌లో వాట్సాప్ చాట్‌లు(WhatsApp Chat leaked) చెక్ చేశారు. ఢిల్లీ బాబా చాటింగ్ చూసి పోలీసులు షాక్ అయ్యారు. బాబా విద్యార్థినులను లైంగికంగా వేధించడమే కాకుండా, వారిని విదేశీయులకు పంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా సేకరించిన చైతన్యానంద వాట్సాప్ చాట్స్‌లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఒక దుబాయ్ షేక్‌కు సెక్స్ భాగస్వామి కావాలి, నీ స్నేహితుల్లో ఎవరైనా ఉన్నారా?” అని బాబా ఓ విద్యార్థినిని అడిగినట్లు ఉంది. దానికి ఆ విద్యార్థిని “ఎవరూ లేరు” అని చెప్పింది. బాబా “అదెలా సాధ్యం? నీ క్లాస్‌మేట్స్, జూనియర్స్ ఎవరైనా?” ఉంటే చెప్పు అని పదేపదే ఆ చాట్‌లో అడిగాడు.
ఇలాంటి మెస్సేజ్‌లు బాబా ఫోన్‌లో చాలా మంది అమ్మాయిలతో చేశాడు. మరో విద్యార్థినికి పంపిన మెసేజ్‌లలో ఆమెని ‘స్వీటీ బేబీ డాటర్ డాల్’ అంటూ పలిచాడు. అభ్యంతరకరమైన, లైంగిక వేధింపులకు గురిచేసే సందేశాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. రాత్రి వేళల్లో కూడా మెసేజ్‌లు పంపి, తనతో పడుకోవాలని బలవంతం చేసినట్లు కూడా బాధితులు ఆరోపించారు.
దాదాపు 17 మంది మహిళా విద్యార్థినులు చైతన్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో తప్పించుకు తిరుగుతున్న ఈ బాబాను పోలీసులు ఇటీవల ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఇతను ఫ్రాడ్ పత్రాలు సృష్టించి, రూ. 50 లక్షలకు పైగా నగదు విత్‌డ్రా చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ బాబాపై లైంగిక వేధింపులు, మోసం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ షాకింగ్ వాట్సాప్ చాట్స్‌తో బాబా అసలు రూపం మరింత బయటపడింది.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!