గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
నెల్లూరు(విద్య), : గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు, పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక భక్తవత్సల నగర్లోని కేఎన్ఆర్ నగరపాలక సంస్థ పాఠశాలలో కొత్తపాళెం గురుమహేంద్ర (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అక్కడ నిర్మాణంలో ఉన్న నాడు-నేడు అదనపు తరగతి గదుల మొండి గోడల వద్దకు వెళ్లి కిటికీపై ఉన్న లింటెల్ను పట్టుకున్నాడు. అది విరిగి విద్యార్థి తలపై పడటంతో మృతి చెందాడు. విద్యార్థి తల్లిదండ్రులది తిరుపతి జిల్లా వెంకటగిరి స్వగ్రామం. కుమారుడి చదువు నిమిత్తం నగరానికి వలస వచ్చారు. తండ్రి ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ పాఠశాలలో రెండో విడత నాడు- నేడులో భాగంగా చేపట్టిన అదనపు తరగతి గదుల పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, అందువల్ల నిర్మాణం కూలి విద్యార్థి మృతి చెందాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు
Also read :పాతబస్తీలో మహిళలను జుగుప్సాకరంగా తాకుతూ వికృత చేష్టలు.. నిందితుడిని వెంటాడిన స్థానికులు
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ప్రభుత్వ సాయం
ఈనాడు, అమరావతి: మృతి చెందిన విద్యార్థి గురుమహేంద్ర కుటుంబానికి విద్యా శాఖ మంత్రి లోకేశ్ రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. విద్యార్థి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు.
Also read :Cyber Fraud: ఫోన్‌లోనే సంప్రదింపులు.. ఆన్‌లైన్‌లో నియామకాలు.. కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ళు..!
గ్యాస్ లీకై పేలిన ఆటో.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..ఆ భయానక దృశ్యాలు ఇవిగో..
దారుణం: ఆ పని చేయలేదని గర్భిణీ భార్యకు నిప్పంటించిన భర్త!