April 5, 2025
SGSTV NEWS
CrimeSportsTelangana

ఆన్‌లైన్ గేమింగ్‌ వెబ్‌సైట్లపై డీబీజీఐ ఉక్కుపాదం.. 2400 అకౌంట్లు ఫ్రీజ్


ఆన్‌లైన్ గేమింగ్‌ వెబ్‌సైట్లపై డీబీజీఐ ఉక్కుపాదం మోపింది. మొత్తం 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడంతో పాటు గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. అలాగే గేమింగ్ కంపెనీలకు చెందిన రూ.1.26 కోట్లను డీబీజీఐ ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది.

ఆన్‌లైన్ గేమింగ్‌ వెబ్‌సైట్లపై డీబీజీఐ ఉక్కుపాదం మోపింది. మొత్తం 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడంతో పాటు గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. అలాగే గేమింగ్ కంపెనీలకు చెందిన రూ.1.26 కోట్లను డీబీజీఐ ఫ్రీజ్ చేసినట్లు తెలిపింది. ఈ ఆన్‌లైన్ గేమ్స్‌ను ఎవరూ వాడవద్దని అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా..
కొన్ని సంస్థలు వాటి పేర్లను నమోదు చేయకుండా జీఎస్టీ కట్టకుండా ఆదాయాలను దాచుతున్నాయి. ఇలాంటి ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై డీబీజీఐ చర్యలు తీసుకుంది. ఐటీశాఖ సమన్వయంతోనే మొత్తం 357 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితో పాటు బెట్టింగ్‌లు, గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్న 700 సంస్థలపై కూడా నిఘా ఉంచింది.

ఇలాంటి వారికి చెందిన 166 ఖాతాలను కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. అయితే వీటిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పాటు బాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.

Also Read

Related posts

Share via