November 22, 2024
SGSTV NEWS
CrimeNationalUttar Pradesh

ఏడాది క్రితం కూతురికి పెళ్లి.. ఆ వార్త తెలిసే సరికి అత్త ఇంటికి నిప్పు!

ఆడ పిల్లకు ఘనంగా పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు . పెట్టి పోతలు పెట్టారు. హాయిగా కాపురం చేసుకుంటుందనుకున్నారు.. కానీ ఆమె చేసిన పనితో తల్లిదండ్రులకు ఫోన్ వెళ్లింది. దీంతో హుటా హుటిన ఆమె పేరెంట్స్, బంధువులు కూతురి మెట్టినింటికి వెళ్లారు.

పెళ్లిళ్లు రెండు కుటుంబాల మధ్య బంధుత్వంగా మారాలి కానీ శత్రుత్వంగా మారకూడదు. ప్రస్తుతం వివాహాలు జరగడమే గొడవలతో స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతురు తరుఫు వాళ్లు మర్యాదలు చేయలేదని తగాదా పెట్టుకుంటారు మగ పెళ్లి వాళ్లు. అలాగే పెట్టి పోతలు సరిగ్గా పెట్టలేదని, కట్నం చాలలేదని, భోజనం బాలేదని ఇలా అడ్డవైన వంకలు చెబుతుంటారు. పిల్లనిస్తున్నాం కదా అని అమ్మాయి తరుఫు తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోతారు. అక్కడ నుండి ఈ ఘర్షణలు ఆగిపోతున్నాయా అంటే.. ఎక్కువ అవుతున్నాయి. కూతుర్ని నానా రకాలుగా హింస పెట్టడం, అదనపు కట్నం కింద వేధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా వరకట్న వేధింపుల కారణంగా ఓ అమ్మాయి చనిపోయింది.

దీంతో కడుపుకోతకు గురైన ఆమె తల్లిదండ్రులు.. రీవేంజ్ తీర్చుకున్నారు. కూతురు అత్తింటికి నిప్పంటించడంతో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది అన్షుతో అన్షిక అనే యువతితో పెళ్లైంది. అన్హు తన తల్లిదండ్రులు, సోదరి శివానీ, మేనత్తతో నివసిస్తున్నాడు. అన్హు కలప వ్యాపారం చేస్తున్నాడు. మార్చి 18న రాత్రి అన్షిక భోజనం చేయలేదు. తన గదిలో నిద్ర పోతుంది అనుకున్నారు. శివానీ పిలిచినా బయటకు రాలేదు. చివరకు అన్షు వెళ్లి పిలువగా.. ఉరి వేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని అన్షిక తల్లిదండ్రులకు చేరవేశారు. కూతురు చనిపోయిందని తెలియగానే.. అన్షిక తల్లిదండ్రులు ఆమె ఇంటికి బయలు దేరారు.

70 మంది వరకు ఆమె ఇంటికి చేరుకుని దాడి చేశారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను ఇరుగు పొరుగు వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తమ కూతురు సూచాయగా చెప్పిన కొంత సమాచారంతో..అన్షికను అదనపు కట్నం కోసం అన్షు కుటుంబ సభ్యులు వేధించారని భావించి.. పోలీసులకు ఫోన్ చేయకుండా.. ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన బాధితురాలి భర్త అన్షు ఇంట్లో నుండి పరారయ్యాడు. మిగిలిన వారు తలుపులు వేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె తల్లిదండ్రులు.. ఇంటికి నిప్పంటించడంతో మొదటి అంతస్థులో ఉన్న అన్షిక అత్తామామలు సజీవ దహనం అయ్యారు. శివానీ.. ఆమె అత్త తప్పించుకుంది. ఈ ఘటనపై శివానీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 12 మందిని అరెస్టు చేశారు. ఈ వివాహం రెండు ఇళ్లల్లో విషాదాలను నింపింది. పెళ్లి చివరికీ రీవేంజ్ ప్టోరీగా మారింది.

Also read

Related posts

Share via