చిత్తూరు : వివాహేతర సంబంధం మోజులో భర్త, అత్తను చంపడానికి ప్లాన్ చేసిన కవిత అలియాస్ వేలాంగని (37) అనే మహిళను చిత్తూరు వన్టన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గిరింపేటకు చెందిన ఈ మహిళ, ఓ మైనర్ బాలుడితో వివాహేతర బంధం ఏర్పరచుకుని.. అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఈనెల 3వ తేదీ రాత్రి ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఆమె కళ్లల్లో కారం కొట్టింది ఆపై ఆమె అత్త గొంతు కోసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ మరుసటి రోజున బాలుడిను అరెస్టు చేసి.. తిరుపతి జువెనైల్ హోమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహిళను ఎస్ఐ నాగప్ప నాయక్ అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు.
Also read
- చెత్త కుప్పలో డైమండ్ రింగ్స్.. కేటుగాడు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టిందిలా..
- పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో కలిసి..
- సూర్యుడు అస్తమించగానే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Kamakshi Deepam: పూజ గదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!





